సచిన్ రికార్డు టెస్టుకు ఘనమైన ఏర్పాట్లు | sachin tendulkar for test record arrangeing very hugely | Sakshi
Sakshi News home page

సచిన్ రికార్డు టెస్టుకు ఘనమైన ఏర్పాట్లు

Published Sat, Aug 24 2013 1:25 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM

సచిన్ రికార్డు టెస్టుకు ఘనమైన ఏర్పాట్లు

సచిన్ రికార్డు టెస్టుకు ఘనమైన ఏర్పాట్లు

 జొహన్నెస్‌బర్గ్: మాస్టర్ బ్లాస్ట ర్ సచిన్ టెండూల్కర్ ఆడే 200వ టెస్టుకు ఘనమైన ఏర్పాట్లు చేస్తామని క్రికెట్ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు క్రిస్ నెంజానీ తెలిపారు. ఈ ఏడాది చివర్లో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఆడే రెండో టెస్టుతో మాస్టర్ 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంటాడు. ‘ప్రపంచ క్రికెట్‌లోనే 200 టెస్టులు ఆడటం అరుదైన ఘనత.
 
 దీనిని చేరుకుం టున్న దిగ్గజ క్రికెటర్‌ను మేం ఘనంగా గౌరవిస్తాం. ఆ మ్యాచ్ కోసం చేయాల్సిన ఏర్పాట్ల గురించి ఇప్పటికే మాకు స్పష్టత ఉంది. దీనిపై బీసీసీఐతో పాటు భారత టీమ్ మేనేజ్‌మెంట్‌తోనూ చర్చించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం’ అని క్రిస్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement