
సరితను కలిసిన సచిన్
ముంబై: ఏడాది నిషేధం ఎదుర్కొంటున్న బాక్సర్ సరితాదేవిని ఆమె ఇంట్లో దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ కలిశాడు. ఈసందర్భంగా తన సంతకంతో కూడిన టీషర్ట్‌ను ఆమెకు బహుమానంగా ఇచ్చాడు. ‘సరితా దేవిని కలిశాను. ఆమె కళ్లల్లో ఎప్పుడెప్పుడు బరిలోకి దిగుదామా అనే కసి కనిపించింది. విజయం కలగాలని శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఆటను ఆస్వాదించు.. నిరంతరం ఉత్తమ ఆటతీరును కనబరుచు’ అనే సందేశం రాశాను’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. మరోవైపు సచిన్ మద్దతుపై సరితా దేవి హర్షం వ్యక్తం చేసింది.