ముంబై: రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘమైన తన కెరీర్‌లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎన్నోసార్లు గాయపడ్డాడు. వాటిని అధిగమించి క్రికెట్ ఐకాన్‌గా నిలిచాడు. టెన్నిస్ ఎల్బో గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడిన మాస్టర్ ఆ అనుభవాన్ని యువ వైద్యులతో పంచుకున్నాడు. ‘స్పోర్ట్స్ ఇంజ్యూరీస్’ పేరిట ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు సుధీర్ వారియర్ నిర్వహించిన ‘లైవ్ వెబినార్’ కార్యక్రమంలో సచిన్ స్వచ్ఛందంగా పాల్గొన్నాడు. 12,000 మంది యువ వైద్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సచిన్ క్రీడా గాయాలపై తన అనుభవాన్ని వారితో పంచుకున్నాడు. సచిన్‌తో సంభాషించిన యువ వైద్యులు సాధారణ వ్యక్తులకు, క్రీడాకారులకు వైద్య చికిత్సలో అందించాల్సిన సేవలపై అవగాహన ఏర్పరచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment