
న్యూఢిల్లీ: భారత దిగ్గజం సచిన్, ఆస్ట్రేలియాకు చెందిన బ్యాట్ల తయారీ కంపెనీ ‘స్పార్టన్’ల మధ్య ఏడాది కాలంగా కొనసాగుతోన్న వివాదం ముగిసింది. ఒప్పంద ఉల్లంఘనకుగాను గురువారం కంపెనీ క్షమాపణలు తెలపడంతో సచిన్ ఈ వివాదాన్ని ముగించేందుకు అంగీకరించాడు. ‘ఇచ్చిన మాట తప్పినందుకు టెండూల్కర్ మన్నించాలి’ అని స్పార్టన్ సీఓఓ లెస్ గాల్‌బ్రెత్ కోరాడు. ‘స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని గౌరవించనందుకు సచిన్‌కు హృదయపూర్వక క్షమాపణలు.
అత్యంత ఓపికగా ఈ వివాదాన్ని పరిష్కరించిన సచిన్ తీరుకు మా కృతజ్ఞతలు’ అని ఆయన చెప్పారు. 2016లో స్పార్టన్ కంపెనీకి సచిన్ ప్రచారకర్తగా వ్యవహరించాడు. అయితే ఒప్పందం ప్రకారం రాయల్టీ, ఎండార్స్‌మెంట్ ఫీజులు చెల్లించడంలో స్పార్టన్ విఫలమైంది. ఒప్పందం ముగిశాక కూడా అనుమతి లేకుండా సచిన్ ఫొటోలు, పేరు వాడుకుంటూ వ్యాపారం చేసింది. దీంతో న్యాయబద్ధంగా పోరాటం చేసిన సచిన్ గతేడాది జూన్‌లో ఆ కంపెనీపై 2 మిలియన్ డాలర్లు (రూ. 15.1 కోట్లు) దావా వేశాడు.
Comments
Please login to add a commentAdd a comment