
ప్రారంభ కార్యక్రమంలో సచిన్
నేడు అట్టహాసంగా జరిగే కామన్వెల్త్ క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రత్యేకంగా కనిపించనున్నాడు.
గ్లాస్గో: నేడు అట్టహాసంగా జరిగే కామన్వెల్త్ క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రత్యేకంగా కనిపించనున్నాడు. మాస్టర్ ప్రస్తుతం యూనిసెఫ్ తరఫున గ్లోబల్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.
గ్లాస్గో సీడబ్ల్యుజీ నిర్వాహకులు, కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్యలతో యూనిసెఫ్ భాగస్వామ్యంగా ఉంది. ఈ కారణంగా అంబాసిడర్ సచిన్ కూడా ఈవెంట్స్‌లో తళుక్కుమననున్నాడు. అయితే ఇందులో సచిన్ పాత్ర ఎలా ఉండబోతుందనేది సస్పెన్స్‌గా ఉంది. రాణి రెండో ఎలిజబెత్, ప్రధాని కామెరూన్‌తో పాటు సచిన్ కార్యక్రమంలో పాల్గొంటాడా? లేదా అనేది నిర్వాహకులు చెప్పడం లేదు.