
సెమీస్‌లో సాయిదేదీప్య జంట
‘ఐటా’ మహిళల టెన్నిస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన సాయిదేదీప్య–షేక్ హుమేరా జోడీ సెమీఫైనల్లో ప్రవేశించింది. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీ మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో సాయిదేదీప్య–హుమేరా జంట 6–2, 6–0తో అవిష్క గుప్తా (జార్ఖండ్)–వన్షికా పఠానియా (కర్ణాటక) జోడీపై గెలుపొందింది. నేడు జరిగే సెమీస్‌లో దేదీప్య జోడీ హర్షసాయి (ఏపీ)– హిమానీ మోర్ (హరియాణా) జంటతో తలపడుతుంది.