- ఫస్ట్ సెమీస్లో వరల్డ్ చాంప్ మారిన్ ఔట్
- దీంతో మరో సెమీస్ ఫలితంతో నిమిత్తం లేకుండానే నెం 1 ఘనత సాధించిన హైదరాబాదీ
న్యూఢిల్లీ: ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా సైనా నెహ్వాల్ ఘనతను సొంతం చేసుకుంది. ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో భాగంగా తొలి సెమీస్ లో ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ ఓటమిపాలవ్వడంతో మరో సెమీస్ ఫలితంతో నిమిత్తం లేకుండానే సైనా ప్రపంచ నంబర్ వన్ అయింది.
తొలి సెమీస్లో థాయిలాండ్ స్టార్ మూడోసీడ్ ఇలనాన్ రచానోక్.. మారిన్కు షాక్ ఇచ్చి ఫైనల్స్కు చేరింది. ఈ మ్యాచ్ లో ఇలానాన్.. 21-19, 21-23, 22- 20 తేడాతో మారిన్ ను ఓడించింది. మరో సెమీఫైనల్లో వరల్డ్ నంబర్ 1 ర్యాంకర్, హైదరాబాద్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్.. జపాన్ కు చెందిన యూ హషిమొటోతో అమీతుమీ తేల్చుకోనుంది. మరి కొద్ది గంటల్లో ఈ మ్యాచ్ మొదలుకానుంది. ప్రకాశ్ పదుకుణె తరువాత ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు సాధించింది సైనా నెహ్వాల్ ఒక్కరే కావడం విశేషం. దీంతో ఇండియన్ బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ సైనా నెహ్వాల్ రికార్డును సొంతం చేసుకుంది.