world number one
-
ATP Belgrade: సెమీ ఫైనల్లో జొకోవిచ్
సొంతగడ్డపై జరుగుతున్న ఏటీపీ 250 టోర్నీ బెల్గ్రేడ్ ఓపెన్‌లో వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ దూసుకుపోతున్నాడు. ఈ టోర్నీలో సెర్బియా స్టార్ సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో జొకోవిచ్ 4–6, 6–3, 6–3 తేడాతో కెక్మనోవిక్ (సెర్బియా)ను ఓడించాడు. తన దేశానికే చెందిన ఆటగాడినుంచి పోటీ ఎదుర్కొని తొలి సెట్ కోల్పోయినా...2 గంటల 18 నిమిషాల ఈ పోరులో చివరకు జొకోవిచ్ తన అనుభవంతో ముందంజ వేశాడు. -
బార్టీకి షెల్బీ షాక్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆదివారం పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) మూడో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. సొంత ప్రేక్షకుల నడుమ అమెరికా క్రీడాకారిణి షెల్బీ రోజర్స్ అద్భుత ఆటతీరుతో యాష్లే బార్టీని బోల్తా కొట్టించింది. 2 గంటల 8 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 43వ ర్యాం కర్ షెల్బీ రోజర్స్ 6–2, 1–6, 7–6 (7/5)తో యాష్లే బార్టీని ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశిచింది. నిర్ణాయక మూడో సెట్లో షెల్బీ 2–5తో వెనుకబడి పుంజుకోవడం విశేషం. ఎనిమిదో గేమ్‌లో బార్టీ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని ఉంటే విజయాన్ని దక్కించుకునేది. కానీ షెల్బీ ధాటికి బార్టీ తొలుత ఎనిమిదో గేమ్‌లో, ఆ తర్వాత పదో గేమ్‌లో తన సరీ్వస్‌లను కోల్పోయింది. వరుసగా రెండు బ్రేక్ పాయింట్లు సాధించిన షెల్బీ స్కోరును 5–5తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ తమ సరీ్వస్‌లను కాపాడుకోవడంతో చివరి సెట్ టైబ్రేక్‌కు దారి తీసింది. టైబ్రేక్‌లో 4–5తో వెనుకబడిన షెల్బీ వరుసగా మూడు పాయింట్లు గెలిచి బార్టీ కథ ముగించింది. ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు, 39 అనవసర తప్పిదాలు చేసిన బార్టీ తగిన మూల్యం చెల్లించుకుంది. క్వార్టర్ ఫైనల్లో స్వితోలినా ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–3, 6–3తో 12వ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరింది. జొకోవిచ్ జోరు పురుషుల సింగిల్స్ విభాగంలోనూ సంచలన ఫలితం నమోదైంది. ఏడో సీడ్ షపోవలోవ్ (కెనడా) ఓటమి చవిచూడగా... టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. లాయిడ్ హ్యారిస్ (దక్షిణాఫ్రికా) 6–4, 6–4, 6–4తో షపోవలోవ్‌ను ఓడించగా... టాప్ సీడ్ జొకోవిచ్ 6–7 (4/7), 6–3, 6–3, 6–2తో నిషికోరి (జపాన్)పై, జ్వెరెవ్ 3–6, 6–2, 6–3, 6–1తో జాక్ సోక్ (అమెరికా)పై విజయం సాధించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేíÙయా) జోడీ 6–3, 4–6, 6–4తో హుగో నిస్ (మొనాకో) –రిండెర్క్నిచ్ (ఫ్రాన్స్) జంటపై గెలిచింది. -
యాష్లే బార్టీ జోరు
న్యూయార్క్: ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో మహిళల ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ జోరు కనబరుస్తోంది. గురువారం జరిగిన మహిళల రెండో రౌండ్లో బార్టీ 6–1, 7–5తో క్లారా టౌసన్ (డెన్మార్క్)పై వరుస సెట్లలో గెలిచి మూడో రౌండ్‌కు అర్హత సాధించింది. మ్యాచ్‌లో బార్టీ 11 ఏస్‌లు కొట్టి రెండు డబుల్ ఫాల్ట్‌లను చేయగా... క్లారా రెండు ఏస్‌లను సంధించి మూడు డబుల్ ఫాల్ట్‌లను చేసింది. ఆమెతో పాటు ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ విజేత బార్బొరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 6–1తో క్రిస్టినా మెకాలే (అమెరికా)పై, రెండో సీడ్ అరీనా సబలెంకా (బెలారస్) 6–3, 6–1తో తామర జిదాన్సెక్ (స్లొవేనియా)పై, 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్ స్టీఫెన్స్ 6–4, 6–2తో కోకో గాఫ్ (అమెరికా)పై గెలుపొందారు. సిట్సిపాస్, మెద్వెదేవ్ ముందంజ... పురుషుల విభాగంలో గ్రీస్ ప్లేయర్, మూడో సీడ్ స్టెఫనోస్ సిట్సిపాస్, ఈ టోర్నీ రెండు సార్లు రన్నరప్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా) మూడో రౌండ్లో ప్రవేశించారు. రెండో రౌండ్లో సిట్సిపాస్ 3–6, 6–4, 7–6 (7/4), 6–0తో అడ్రియాన్ మనారినో (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. మ్యాచ్‌లో సిట్సిపాస్ ఏకంగా 27 ఏస్‌లు సంధించాడు. మెద్వెదేవ్ 6–4, 6–1, 6–2తో డొమినిక్ కొఫెర్ (జర్మనీ)పై గెలిచి మూడు రౌండ్‌కు చేరుకున్నాడు. -
జొకోవిచ్ శుభారంభం
న్యూయార్క్: ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతపై గురి పెట్టిన వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ లో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ప్రపంచ 145వ ర్యాంకర్ హోల్గర్ రూన్ (డెన్మార్క్)తో బుధవారం జరిగిన తొలి రౌండ్లో జొకోవిచ్ 6–1, 6–7 (5/7), 6–2, 6–1తో గెలిచాడు. మరోవైపు తొమ్మిదో సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్) తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. క్రెసీ (అమెరికా) 5–7, 4–6, 6–1, 6–4, 7–6 (9/7)తో బుస్టాపై గెలిచాడు. ఒసాకా, హలెప్ ముందంజ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్), మాజీ నంబర్‌వన్ సిమోనా హలెప్ (రొమేనియా) మూడో రౌండ్లోకి చేరారు. రెండో రౌండ్లో ఒసాకాతో ఆడాల్సిన ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా) ‘వాకోవర్’ ఇచ్చింది. హలెప్ 6–3, 6–1తో కుచోవా (స్లొవేకియా)పై నెగ్గింది. మరో వైపు టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), ఆరో సీడ్ బియాంక ఆండ్రెస్కూ (కెనడా), నాలుగో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్‌కు చేరారు. -
దంగల్ @ 2000 కోట్లు... నాటౌట్
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా ‘బాహుబలి’ నిలిచింది. అయితే ఇది నిన్నటి మాట. ఇప్పుడీ స్థానాన్ని హిందీ చిత్రం ‘దంగల్’ దక్కించుకుంది. రూ. 2,000 కోట్లు వసూళ్లు సాధించి, ఎక్కువ కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాగా వరల్డ్‌లో ‘నంబర్ వన్’ స్థానంలో నిలిచింది ‘దంగల్’. ఇటీవల చైనాలో ఈ చిత్రాన్ని ‘షుయి జియావో బాబా’ పేరుతో విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్కడ మాత్రమే ఈ చిత్రం 1,200 కోట్లు రాబట్టింది. దాంతో ‘బాహుబలి’ రికార్డుని బీట్ చేసింది. ఇంకా ఈ సినిమా చైనాలో విజయవంతంగా దూసుకెళుతోందట. ఆ సంగతలా ఉంచితే.. ‘బాహుబలి–2’ని వచ్చే నెల చైనాలో విడుదల చేయనున్నారు. మరి.. ఈ చిత్రం అక్కడ సాధించే వసూళ్లను బట్టి ఎక్కువ కలెక్ట్ చేసిన ఫస్ట్ ఇండియన్ సినిమా ఏది? అనేది డిసైడ్ అవుతుంది. ‘ఇండియన్ సినిమా నంబర్ వన్’ రికార్డు గురించి పక్కన పెడితే ‘దంగల్’ చైనీస్ కలెక్షన్స్ హాలీవుడ్ సినిమాలకు షాక్ ఇచ్చాయి. హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ అయిన ‘కెప్టెన్ అమెరికా: సివిల్ వార్’, ‘ట్రాన్స్ఫార్మర్స్: డార్క్ ఆఫ్ ది మూన్’, ‘కుంగ్‌ఫూ ఫాండా’, ‘ది జంగిల్‌బుక్’లతోపాటు వరల్డ్ సూపర్‌హిట్ మూవీ ‘అవతార్’కు మించిన వసూళ్లను చైనా బాక్సాఫీసు వద్ద ‘దంగల్’ రాబట్టుకోవడం విశేషం. చైనాలో అత్యధిక వసూళ్లను రాబట్టిన నాన్–ఇంగ్లీష్ మూవీగా ఐదో స్థానం దక్కించుకుంది. అక్కడ మిగతా నాలుగు స్థానాల్లో నిలిచిన నాన్–ఇంగ్లీష్ చిత్రాలు ఏంటంటే... ‘ది మెర్మైడ్’ (చైనా), ‘మాన్స్టర్ హాంట్’ (చైనా), ది ఇన్టచ్బుల్స్(ఫ్రాన్స్), యువర్ నేమ్ (జపాన్). ఐదో స్థానంలో ఇండియన్ మూవీ ‘దంగల్’ ఉండటం గర్వించదగ్గ విషయం. గ్రేట్ రెజ్లర్ మహావీర్‌సింగ్ ఫోగట్ జీవితం ఆధారంగా నితీష్ తివారీ డైరెక్షన్లో అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. -
సైనా బ్యాడ్మింటన్ ప్రస్థానం ఇలా..
ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా సైనా నెహ్వాల్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో భాగంగా తొలి సెమీస్ లో ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ ఓటమిపాలవ్వడంతో సైనా ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని కైవశం చేసుకుంది. సైనా బ్యాడ్మింటన్ ప్రస్థానం ఇలా.. సైనా నెహ్వాల్ మార్చి 17, 1990న హర్యానాలోని హిస్సార్ లో జన్మించింది. తల్లి దండ్రులిద్దరూ హర్యానా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సాధించినవారే. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న ఈ క్రీడాకారిణి బ్యాడ్మింటన్ లో తనదైన ముద్రతో ముందుకు దూసుకుపోతుంది. 2006లో ఫిలిప్పిన్స్ ఓపెన్ బ్యాడ్మింటన్‌ను గెలిచి స్టార్ ఓపెన్‌ను గెలిచిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించటంతో సైనా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆ టోర్నమెంటులో 86వ సీడ్‌గా ప్రవేశించిన ఆమె పలు టాప్‌సీడ్‌లను ఓడించి చివరకు విజేతగా నిల్చింది. అదే సంవత్సరం బీడబ్యూఎఫ్ ప్రపంచ చాంపియన్‌లో రన్నరప్‌గా నిల్చింది. 2007 లో ఇండియా నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో విజయం సాధించి, జాతీయ క్రీడలలో బ్యాడ్మింటన్ స్వర్ణాన్ని గెలుచుకుంది. 2008లో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌ను సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. చైనా మాస్టర్ సూపర్ సీరీస్‌లో సెమీస్ వరకూ సైనా వెళ్ల గల్గింది. ఇండియన్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో విజేతగా నిలిచి, అదే సంవత్సరం కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో స్వర్ణపతకం సాధించింది. ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో కూడా టైటిల్ సాధించింది. 2009 లో ఇండోనేషియా ఓపెన్‌లో టైటిల్ సాధించి, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్ వరకూ వెళ్లింది. 2010 లో ఆల్ ఇంగ్లండ్ సూపర్ సీరీస్ సెమీస్ వరకు వెళ్ళింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం పొందడమే కాకుండా..ఇండియా ఓపెన్, ఇండోనేషియా ఓపెన్ గ్రాండ్ ప్రిక్ టైటిళ్లును సైనా కైవశం చేసుకుంది. అయితే 2011 ఆరంభంలో స్విస్ ఓపెన్ గెలిచిన సైనాకు ఆ తరువాత ప్రతికూల ఫలితాలే వచ్చాయి. కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ లో సైనా రెండో రౌండ్ ను కూడా అధిగమించలేకపోయింది. అదే సంవత్సరం ఆల్ ఇంగ్లండ్ సూపర్ సిరీస్ లో సైనా ఆదిలోనే ఓటమి చెందింది. వరల్డ్ చాంపియన్ షిప్ లో కూడా సైనా ఓటమి చెందడంతో తన మూడో ర్యాంక్ ను కోల్పోయింది. అయితే వరల్డ్ చాంపియన్ షిప్ లో రెండు సార్లు క్వార్టర్స్ వరకూ వెళ్లిన ఘనతను సైనా సొంతం చేసుకుంది. ఆ సంవత్సరంలోనే డెన్మార్ ఓపెన్, ఫ్రెంచ్ సూపర్ సిరీస్,హాంగాక్ సూపర్ సిరీస్ లలో సైనాకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. 2012వ సంవత్సరంలో సైనా జైత్రయాత్ర కొనసాగింది. ఆరంభంలో జరిగిన స్విస్ ఓపెన్ ను కాపాడుకోవడంలో సైనా సఫలమయ్యింది. ఇండోనేషియా సూపర్ సిరీస్ టైటిల్ ను, సమ్మర్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా.. డెన్మార్క్ సూపర్ సిరీస్ ను తొలిసారి కైవశం చేసుకుంది. 2014 లో మూడు టైటిళ్లను సైనా గెలుచుకుంది. ఇండియా ఓపెన్, ఆస్ట్రేలియా సూపర్ సిరీస్, చైనా ఓపెన్ సూపర్ సిరీస్ లను సైనా దక్కించుకుంది. 2015 లో ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ టైటిల్ సైనాను వరించింది. తరువాత ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ ఫైనల్ కు చేరి తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన సైనా.. చివరి అడ్డంకిని దాటలేకపోయింది. -
సైనా.. వరల్డ్ నంబర్ 1
- ఫస్ట్ సెమీస్‌లో వరల్డ్ చాంప్ మారిన్ ఔట్ - దీంతో మరో సెమీస్ ఫలితంతో నిమిత్తం లేకుండానే నెం 1 ఘనత సాధించిన హైదరాబాదీ న్యూఢిల్లీ: ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా సైనా నెహ్వాల్ ఘనతను సొంతం చేసుకుంది. ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో భాగంగా తొలి సెమీస్ లో ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ ఓటమిపాలవ్వడంతో మరో సెమీస్ ఫలితంతో నిమిత్తం లేకుండానే సైనా ప్రపంచ నంబర్ వన్ అయింది. తొలి సెమీస్‌లో థాయిలాండ్ స్టార్ మూడోసీడ్ ఇలనాన్ రచానోక్.. మారిన్‌కు షాక్ ఇచ్చి ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్ లో ఇలానాన్.. 21-19, 21-23, 22- 20 తేడాతో మారిన్ ను ఓడించింది. మరో సెమీఫైనల్లో వరల్డ్ నంబర్ 1 ర్యాంకర్, హైదరాబాద్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్.. జపాన్ కు చెందిన యూ హషిమొటోతో అమీతుమీ తేల్చుకోనుంది. మరి కొద్ది గంటల్లో ఈ మ్యాచ్ మొదలుకానుంది. ప్రకాశ్ పదుకుణె తరువాత ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు సాధించింది సైనా నెహ్వాల్ ఒక్కరే కావడం విశేషం. దీంతో ఇండియన్ బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ సైనా నెహ్వాల్ రికార్డును సొంతం చేసుకుంది. -
తొలి టెస్టులో పాకిస్థాన్ విజయం
అబుదాబి: టెస్టుల్లో వరల్డ్ నంబర్‌వన్ జట్టుగా కొనసాగుతున్న దక్షిణాఫ్రికాకు పాకిస్థాన్ షాక్ ఇచ్చింది. ఇటీవలే వరల్డ్ నెంబర్ 9 జింబాబ్వే చేతిలో ఓడి విమర్శలపాలైన పాక్... అగ్రశ్రేణి జట్టుపై స్ఫూర్తిదాయక విజయం సాధిం చింది. నాలుగో రోజే ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడిం చింది. 40 పరుగుల విజయలక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పో యి పాక్ అందుకుంది. డిసెంబర్ 2011లో (డర్బన్) శ్రీలంక చేతిలో పరాజయం తర్వాత 15 టెస్టుల పాటు ఓటమి ఎరుగని దక్షిణాఫ్రికా జోరుకు తాజా ఫలితం తో బ్రేక్ పడింది. యూఏఈ దేశాన్ని సొంత మైదానం గా మార్చుకున్న పాక్ ఇక్కడ నం.1 జట్టుపై వరుసగా నాలుగో విజయాన్ని సాధించడం విశేషం. 2011-12లో అప్పటి టాప్ టీమ్ ఇంగ్లండ్‌పై పాక్ 3-0 తేడాతో విజయాన్ని అందుకుంది. కట్టడి చేసిన అజ్మల్... 72/4 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 232 పరుగులకు ఆలౌటైంది. ఏబీ డివిలియర్స్ (157 బంతుల్లో 90; 7 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ అవకాశం కోల్పోగా, రాబిన్ పీటర్సన్ (67 బంతుల్లో 47 నాటౌట్; 3 ఫోర్లు) కొద్ది సేపు పోరాడాడు. డుమిని (0), డుప్లెసిస్ (9) విఫలమయ్యారు. సయీద్ అజ్మల్ (4/74) చక్కటి బౌలింగ్‌తో దక్షిణాఫ్రికాను కట్టడి చేయగా, జునైద్ ఖాన్ (3/57) కీలక వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 193 పరుగులను మినహాయించి 40 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా పాక్ తడబడింది. 7 పరుగులకే జట్టు ఖుర్రమ్ (4), మసూద్ (0), అజహర్ అలీ (3) వికెట్లు కోల్పోయింది. అయితే ఈ దశలో కెప్టెన్ మిస్బా (26 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఖుర్రమ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 23 నుంచి దుబాయ్‌లో రెండో టెస్టు జరుగుతుంది. -
ఇవనోవిచ్ అలవోకగా...
న్యూయార్క్: ప్రపంచ మాజీ నంబర్‌వన్ అనా ఇవనోవిచ్ యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 13వ సీడ్ ఇవనోవిచ్ 6-2, 6-0తో అనా తాతిష్విలి (జార్జియా)పై గెలిచింది. 2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా, ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచి ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించిన ఇవనోవిచ్ కెరీర్ ఆ తర్వాత తడబడింది. బరిలోకి దిగిన గత 21 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ఈ సెర్బియా బ్యూటీ కేవలం ఒక టోర్నీలో (గత ఏడాది యూఎస్ ఓపెన్‌లో) మాత్రమే క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకుంది. ఈసారి గత ప్రదర్శనను మెరుగుపర్చుకోవాలనే పట్టుదలతో ఉన్న ఇవనోవిచ్‌కు తొలి రౌండ్లో అంతగా ప్రతిఘటన ఎదురుకాలేదు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసిన ఈ మాజీ నంబర్‌వన్ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. మరో మ్యాచ్‌లో ఏడో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-2, 3-6, 6-1తో మిసాకి డోయ్ (జపాన్)పై కష్టపడి గెలుపొందగా... 10వ సీడ్ రొబెర్టా విన్సీ (ఇటలీ) 6-4, 6-2తో తిమియా బాబోస్ (హంగేరి)పై నెగ్గింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 10వ సీడ్ మిలోస్ రావ్‌నిక్ (కెనడా) 6-3, 7-6 (8/6), 6-3తో ఫాబియానో (ఇటలీ)పై విజయం సాధించాడు. నాదల్ శుభారంభం గాయం నుంచి కోలుకున్నాక అద్భుత ఫామ్‌లో ఉన్న 2010 యూఎస్ ఓపెన్ చాంపియన్ రాఫెల్ నాదల్కు తొలి రౌండ్లో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. ‘అమెరికా రైజింగ్ స్టార్’ ర్యాన్ హారిసన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాదల్ 6-4, 6-2, 6-2తో గెలిచి హార్డ్ కోర్టు సీజన్లో వరుసగా 16వ విజయాన్ని నమోదు చేశాడు. మరోవైపు 27వ సీడ్ ఫెర్నాండో వెర్దాస్కో (స్పెయిన్), 30వ సీడ్ ఎర్నెస్ట్ గుల్బిస్ (లాత్వియా) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. ఇవాన్ డొడిగ్ (క్రొయేషియా) 6-3, 7-5, 1-6, 4-6, 6-3తో వెర్దాస్కోపై; ఆండ్రియా హైదర్ మారెర్ (ఆస్ట్రియా) 3-6, 6-3, 1-6, 7-6 (7/4), 6-4తో గుల్బిస్పై గెలిచారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 7-5, 6-3, 6-2తో కిర్గియోస్ (ఆస్ట్రేలియా)పై; ఎనిమిదో సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) 6-3, 6-4, 6-2తో రసెల్ (అమెరికా)పై; 19వ సీడ్ టామీ రొబ్రెడో (స్పెయిన్) 6-3, 6-7 (6/8), 6-3, 6-2తో మాటోసెవిచ్ (ఆస్ట్రేలియా)పై; 23వ సీడ్ లోపెజ్ (స్పెయిన్) 6-7 (4/7),6-2, 6-3, 6-3తో సెరా (ఫ్రాన్స్)పై నెగ్గారు. సెరెనా ముందంజ మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ తన టైటిల్ వేటను ఘనంగా ప్రారంభించింది. తొలి రౌండ్లో టాప్ సీడ్ సెరెనా 6-0, 6-1తో 2010 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఫ్రాన్సెస్కా షియవోని (ఇటలీ)ని చిత్తు చేసింది. క్యాన్సర్‌ను జయించి... రెండేళ్ల క్రితం ప్రపంచ 20వ ర్యాంకర్‌గా నిలిచి ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడిన రష్యా టెన్నిస్ ప్లేయర్ అలీసా క్లెబనోవా పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంది. 24 ఏళ్ల క్లెబనోవా తొలి రౌండ్లో 6-4, 3-6, 7-5తో మోనికా పుయెగ్ (ప్యూర్టోరికో)పై గెలిచింది. గతంలో యూఎస్ ఓపెన్‌లో ఆడిన రెండుసార్లూ ఈ రష్యా ప్లేయర్ రెండో రౌండ్‌ను దాటలేకపోయింది. ‘క్యాన్సర్ నుంచి బయటపడి మళ్లీ రాకెట్ పట్టినందుకు ఆనందంగా ఉంది. మళ్లీ విజయాలబాట పడతాననే విశ్వాసం ఉంది. 2011 మేలో క్యాన్సర్ బారిన పడ్డాను. ఆ తర్వాత ఆరు నెలలపాటు కిమోథెరపీ చేయించుకున్నాను. చాలా రోజుల క్రితమే చికిత్స పూర్తయినా కోలుకోవడానికి సమయం పట్టింది. మొత్తానికి మరోసారి మెగా ఈవెంట్లో ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది’ అని క్లెబనోవా వ్యాఖ్యానించింది. ఈమె 2003లో సానియా మీర్జాతో కలిసి వింబుల్డన్ జూనియర్ బాలికల డబుల్స్ టైటిల్ నెగ్గింది. -
ముంబైకి రెండో విజయం
ముంబై: ‘తురుపుముక్క’ లీ చోంగ్ వీ బరిలోకి దిగడంతో ముంబై మాస్టర్స్ జట్టు మెరిసింది. గాయం కారణంగా తొలి రెండు లీగ్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ఈ ప్రపంచ నంబర్‌వన్ మూడో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. దాంతో ముంబై మాస్టర్స్ ఒక్కసారిగా బలోపేతమైంది. ఫలితంగా ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ స్మాషర్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై మాస్టర్స్ 4-1తో గెలిచింది. ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్, భారత జట్టు మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ సతీసమేతంగా... టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి తదితరులు ఈ పోటీని తిలకించారు. పురుషుల తొలి సింగిల్స్‌లో లీ చోంగ్ వీ (ముంబై) 21-12, 21-16తో డారెన్ లియూ (ఢిల్లీ)ను ఓడించి ‘మాస్టర్స్’ జట్టుకు శుభారంభం అందించాడు. రెండో మ్యాచ్‌లో ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్, మాజీ నంబర్‌వన్ టిన్ బౌన్ 21-11, 21-13తో అరుంధతి పంతవానె (ఢిల్లీ)పై అలవోకగా గెలిచింది. డబుల్స్ మ్యాచ్‌లో కీన్ కీట్ కూ-తాన్ బూన్ హోయెంగ్ (ఢిల్లీ) జోడి 14-21, 21-15, 11-7తో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (ముంబై) ద్వయంపై గెలిచింది. అయితే నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్ రెండో మ్యాచ్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్ మార్క్ జ్విబ్లెర్ 18-21, 21-10, 11-9తో సాయిప్రణీత్ (ఢిల్లీ)పై నెగ్గడంతో ముంబై విజయం ఖాయమైంది. చివరిదైన మిక్స్డ్ డబుల్స్‌లో లీ చోంగ్ వీ-టిన్ బౌన్ జంట 21-18, 15-21, 11-5తో దిజు-ప్రజక్తా సావంత్ జోడిపై గెలవడంతో ముంబై 4-1తో పోటీని సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో ముంబై 11 పాయింట్లతో హైదరాబాద్ హాట్‌షాట్స్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానానికి చేరుకుంది. బుధవారం విశ్రాంతి దినం. నంబర్‌వన్ ఆట... బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే లీ చోంగ్ వీ తన స్థాయికి తగ్గ ఆటతీరుతో అందర్నీ అలరించాడు. కళ్లు చెదిరే స్మాష్‌లు... సమయానుకూలంగా డ్రాప్ షాట్లు... నెట్‌వద్ద దూకుడు... మొత్తానికి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. తొలి రెండు నిమిషాల్లో 7-2తో ఆధిక్యంలోకి వెళ్లిన ఈ మలేసియా దిగ్గజం ఆ తర్వాత దూకుడును మరింత పెంచాడు. వరుసగా ఎనిమిది పాయింట్లు నెగ్గి 20-10తో ముందంజ వేసి అదే జోరులో తొలి గేమ్‌ను 15 నిమిషాల్లో దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో లీ చోంగ్ వీ కాస్త నెమ్మదించడంతో డారెన్ లీ కొన్ని పాయింట్లు రాబట్టాడు. అయితే కీలకదశలో లీ చోంగ్ వీ చెలరేగి మ్యాచ్‌ను ముగించాడు. మ్యాచ్ అనంతరం సచిన్ టెండూల్కర్ మైదానంలోకి వచ్చి లీ చోంగ్ వీతో ముచ్చటించాడు.