న్యూయార్క్: ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతపై గురి పెట్టిన వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ లో రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. ప్రపంచ 145వ ర్యాంకర్ హోల్గర్ రూన్ (డెన్మార్క్)తో బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో జొకోవిచ్ 6–1, 6–7 (5/7), 6–2, 6–1తో గెలిచాడు. మరోవైపు తొమ్మిదో సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్) తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. క్రెసీ (అమెరికా) 5–7, 4–6, 6–1, 6–4, 7–6 (9/7)తో బుస్టాపై గెలిచాడు.
ఒసాకా, హలెప్ ముందంజ
మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్), మాజీ నంబర్‌వన్ సిమోనా హలెప్ (రొమేనియా) మూడో రౌండ్‌లోకి చేరారు. రెండో రౌండ్‌లో ఒసాకాతో ఆడాల్సిన ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా) ‘వాకోవర్’ ఇచ్చింది. హలెప్ 6–3, 6–1తో కుచోవా (స్లొవేకియా)పై నెగ్గింది. మరో వైపు టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), ఆరో సీడ్ బియాంక ఆండ్రెస్కూ (కెనడా), నాలుగో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్‌కు చేరారు.
జొకోవిచ్ శుభారంభం
Published Thu, Sep 2 2021 5:52 AM | Last Updated on Thu, Sep 2 2021 5:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment