సైనా నెహ్వాల్‌ మరోసారీ.. | Saina Nehwal drops out of Macau Open | Sakshi
Sakshi News home page

సైనా నెహ్వాల్‌ మరోసారీ..

Published Fri, Dec 2 2016 12:08 PM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM

సైనా నెహ్వాల్‌ మరోసారీ..

సైనా నెహ్వాల్‌ మరోసారీ..

న్యూఢిల్లీ: ఫామ్‌లేమితో సతమతమవుతున్న భారత ఏస్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. మకావు ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ క్వార‍్టర్స్‌లో సైనా ఓటమి చవిచూసింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా 21-12, 21-17 స్కోరుతో ఝంగ్‌ యిమన్‌ (చైనా) చేతిలో ఓడిపోయింది. ఇటీవల జరిగిన హాంకాంగ్‌ ఓపెన్‌లో కూడా సైనా క‍్వార్టర్స్‌లోనే పోరాటం ముగించింది.

ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ఇటీవల విడుదల చేసిన ర్యాంకింగ్స్‌ జాబితాలో సైనా టాప్‌-10లో చోటు కోల్పోయి 11వ ర్యాంకుకు పడిపోయిన సంగతి తెలిసిందే. గత ఎనిమిదేళ్లలో సైనా టాప్‌-10లో స్థానం కోల్పోవడం ఇదే తొలిసారి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement