క్వార్టర్స్లో సైనా | Saina Nehwal In Quarter-Finals of macau open | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్లో సైనా

Published Thu, Dec 1 2016 12:36 PM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM

క్వార్టర్స్లో సైనా

క్వార్టర్స్లో సైనా

మకావు: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాలో్ మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్కు చేరింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో సైనా 17-21, 21-18, 21-12 తేడాతో దినార్ ద్యా అయుస్టెన్ (ఇండోనేషియా)పై గెలిచి క్వార్టర్స్ లోకి ప్రవేశించింది. తొలి గేమ్ను కోల్పోయిన సైనా.. ఆ తరువాత తిరిగి పుంజుకుంది. వరుస రెండు సెట్లలో గెలిచి టోర్నీలో నిలబడింది.

తొలి గేమ్లో దినార్ 3-1 ఆధిక్యంలోకి వెళ్లిన దశలో సైనా 5-5తో స్కోరు సమం చేసింది. ఆ క్రమంలోనే 10-7 తేడాతో మరింత పైచేయి సాధించింది. కాగా, ఆ దశలో దినార్ నుంచి సైనాకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. వరుసగా పాయింట్ల సాధించిన దినార్ 16-14, 19-15తో ముందుకు దూసుకుపోయింది. ఇక ఆ తరువాత సైనా రెండు పాయింట్లు సాధించినా తొలి గేమ్ను రక్షించుకోలేకపోయింది.

ఇక రెండో గేమ్లో  సైనా 3-0,8-3, 11-3, 18-12 తేడాతో ఆధిక్యం సాధించి ఆ గేమ్ను దక్కించుకుంది. ఆపై నిర్ణయాత్మక మూడో గేమ్లో సైనా 3-2, 6-5,15-9 తేడాతో ముందంజ వేసింది. అదే దూకుడును చివరివరకూ కొనసాగించి  గేమ్ను సాధించి క్వార్టర్స్కు చేరింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement