
సైనాకు మళ్లీ నెంబర్ వన్ కిరీటం
న్యూఢిల్లీ: భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ మళ్లీ నెంబర్ వన్ ర్యాంక్ను కైవసం చేసుకుంది. సైనా చైనా షట్లర్ లీ జ్యురుయ్ను వెనక్కినెట్టి అగ్రస్థానం సాధించింది. గురువారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్లో చైనా షట్లర్ లీ జ్యురుయ్ రెండో స్థానాలు కోల్పోయి మూడో ర్యాంక్కు దిగజారింది.
ఇటీవల ఇండియా ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన సైనా నెంబర్ వన్ ర్యాంక్ సంపాదించినా.. మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ సెమీస్లో ఓటమి అనంతరం ఓ స్థానం కోల్పోయి రెండో ర్యాంక్కు పరిమితమైంది. తాజాగా మళ్లీ ర్యాంక్ను మెరుగుపరచుకుంది. ర్యాంకింగ్స్ జాబితాలో మరో తెలుగుతేజం పీవీ సింధు 12వ స్థానంలో ఉంది. పురుషుల జాబితాలో శ్రీకాంత్ 4వ, కశ్యప్ 14వ స్థానాల్లో ఉన్నారు.