సైనా, శ్రీకాంత్ ముందంజ | Saina Nehwal, Srikanth advance in World Championships | Sakshi
Sakshi News home page

సైనా, శ్రీకాంత్ ముందంజ

Published Tue, Aug 26 2014 10:51 PM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM

Saina Nehwal, Srikanth advance in World Championships

కోపెన్హాగెన్: ప్రపంచ చాంపియన్షిప్లో తెలుగుతేజాలు సైనా నెహ్వాల్, శ్రీకాంత్ ముందంజ వేశారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో భారత స్టార్ షట్లర్ సైనా 21-11, 21-9తో రష్యా షట్లర్ నటాలియా పెర్మినోవాపై అలవోకగా విజయం సాధించింది. సైనా 31నిమిషాల్లోనే వరుస గేమ్ల్లో మ్యాచ్ను సొంతం చేసుకుంది.

పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో శ్రీకాంత్ 21-11, 11-21, 21-12తో ఇజ్టక్ ఉత్రోసా (స్లొవేనియా)పై పోరాడి గెలిచాడు. 47 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో శ్రీకాంత్ మూడు గేమ్ల్లో నెగ్గాడు. మరో భారత షట్లర్ అజయ్ జయరామ్ కూడా రెండో రౌండ్లో ప్రవేశించాడు. కాగా మిక్స్డ్ డబుల్స్లో భారత జోడీ అరుణ్ విష్ణు, అపర్ణా బాలన్ ఓటమి చవిచూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement