సైనా గెలిచినా... | Saina won the ... | Sakshi
Sakshi News home page

సైనా గెలిచినా...

Published Mon, Sep 22 2014 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM

సైనా గెలిచినా...

సైనా గెలిచినా...

ఇంచియాన్: భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు కాంస్య పతకంతోనే సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన సెమీఫైనల్ పోరులో పటిష్ట దక్షిణ కొరియా చేతిలో 1-3 తేడాతో ఓడిపోయింది. అయితే 28 ఏళ్ల అనంతరం భారత్‌కు ఈ విభాగంలో ఓ పతకం దక్కగా... మహిళల విభాగంలో ఇదే తొలిసారి కావడం విశేషం. తొలి మ్యాచ్‌లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సైనా నెహ్వాల్ 21-12, 10-21, 21-9 తేడాతో తనకన్నా మెరుగైన క్రీడాకారిణి సంగ్ జియూన్‌ను ఓడించింది. అయితే రెండో సింగిల్స్‌లో పీవీ సింధు 14-21, 21-18, 13-21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ బే యియోంజు చేతిలో ఓడింది. దీంతో స్కోరు 1-1తో సమమైంది. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఓడి మూల్యం చెల్లించుకుంది. డబుల్స్‌లో సిక్కి రెడ్డి, ప్రద్న్య గాద్రే 16-21, 17-21 తేడాతో కిమ్ సోయియాంగ్, చాంగ్ యెనా చేతిలో ఓడగా... సింగిల్స్‌లో పీసీ తులసి 12-21, 18-21తో కిమ్ యోమిన్‌పై పరాజయం పాలవ్వడంతో... 3-1తో కొరియా ఫైనల్‌కు చేరింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement