సామ సాత్విక జోరు | Sama won singles, doubles under-14 tennis tournment | Sakshi
Sakshi News home page

సామ సాత్విక జోరు

Published Wed, Apr 30 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 6:42 AM

Sama won singles, doubles under-14 tennis tournment

 సింగిల్స్, డబుల్స్‌లో గెలుపు
 ఆసియా ఓసియానియా టోర్నీ
 
 సాక్షి, హైదరాబాద్: ఆసియా ఓసియానియా వరల్డ్ జూనియర్ అండర్-14 టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి సామ సాత్విక విశేషంగా రాణించింది. దీంతో భారత్ 3-0తో కిర్గిస్థాన్‌పై క్లీన్‌స్వీప్ చేసింది. న్యూఢిల్లీలోని డీఎల్‌టీఏ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఈ టీమ్ ఈవెంట్ చాంపియన్‌షిప్‌లో మంగళవారం జరిగిన సింగిల్స్, డబుల్స్ ఈవెంట్లలో సామ సాత్విక విజయాలు నమోదు చేసింది.
 
 తొలి సింగిల్స్‌లో ఆమె 4-6, 6-3, 7-6తో ఎలిజాపై గెలుపొందగా, రెండో సింగిల్స్‌లో ఇంజెల్ శివాని 6-1, 6-2తో ఎర్మెకాను కంగుతినిపించింది. డబుల్స్‌లో సాత్విక-ఆర్జా చక్రవర్తి జోడి 6-1, 6-2తో ఎలిజా-ఎర్మెకా జంటను ఓడించింది. బుధవారం జరిగే పోరులో భారత్... జపాన్‌తో తలపడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement