మాడ్రిడ్ (స్పెయిన్): స్పానిష్ గ్రాండ్ ప్రి రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు రెండు పతకాలు సాధించారు. 57 కేజీల విభాగంలో సందీప్ తోమర్ రజతం సాధించగా... 74 కేజీల విభాగంలో నర్సింగ్ యాదవ్ కాంస్యం గెలిచాడు. 65 కేజీల విభాగంలో యోగేశ్వర్ దత్ పతకం సాధించడంలో విఫలమయ్యాడు.