చరిత్ర సృష్టించిన సానియా | Sania Mirza completes 80 consecutive weeks as World No.1 doubles player | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన సానియా

Published Wed, Oct 19 2016 12:43 PM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM

చరిత్ర సృష్టించిన సానియా

చరిత్ర సృష్టించిన సానియా

న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో ఘనత సాధించింది. నంబర్ వన్ ర్యాంకులో వరుసగా 80 వారాలు కొనసాగి సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల డబుల్స్ విభాగంలో ఎక్కువ రోజులు టాప్ ర్యాంకులో కొనసాగిన భారత క్రీడాకారిణిగా ఆమె తన పేరును లిఖించుకుంది. మార్టినా హింగిస్ తో కలిసి గత సీజన్ లో వోల్వో కార్ ఓపెన్ డబుల్స్ టైటిల్  గెలిచి సానియా నంబర్ వన్ ర్యాంకు దక్కించుకుంది. అప్పటి నుంచి అప్రతిహతంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఈ ఘనత సాధించడం పట్ల సానియా సంతోషం వ్యక్తం చేసింది. 'నంబర్ వన్ ప్లేయర్ గా ఈ రోజుకు వరుసగా 80 వారాలు పూర్తి చేసుకున్నాను. ఇది అద్భుత ప్రయాణం. మరింతగా కష్టపడేందుకు నాకు ప్రేరణనిస్తోంద'ని సానియా ట్వీట్ చేసింది. అరుదైన ఘనత సాధించిన సానియాకు ట్విట్టర్ ద్వారా మహేశ్ భూపతి, పీవీ సింధు, గుత్తా జ్వాల అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement