
నరేంద్ర మోడీతో సానియా భేటీ
న్యూఢిల్లీ: యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించిన భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. శుక్రవారం సానియా తల్లి నసీమాతో కలసి మోడీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
యూఎస్ ఓపెన్లో బ్రెజిల్ ఆటగాడు బ్రూనో సోర్స్తో జతకట్టిన సానియా మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే. సానియాకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా ప్రధాని మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తదితరులు అభినందించారు.