దుబాయ్: మాజీ క్రికెటర్లతో ప్రారంభం కాబోతున్న మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ (ఎంసీఎల్)లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ జట్టును కొన్నారు. ప్రస్తుతం దత్ జైలులో ఉన్నందున అతని భార్య మాన్యత దీనికి సంబంధించిన డీల్‌ను మాట్లాడినట్లు సమాచారం. ‘మా కుటుంబంలో అందరికీ క్రీడల పట్ల ఆసక్తి ఉంది. ముఖ్యంగా సంజయ్‌కు చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి ఎక్కువ’ అని మాన్యత చెప్పారు. దత్ బయటకు వచ్చేవరకూ ఓ టాలెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఈ జట్టుకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.
అలాగే ధోని స్నేహితుడు అరుణ్ పాండే కూడా ఓ జట్టులో వాటా కొనుక్కుం టున్నట్లు సమాచారం. వచ్చే జనవరిలో జరిగే ఈ లీగ్‌లో సెహ్వాగ్, లారా, కలిస్ తదితర మాజీ క్రికెటర్లు ఆడుతున్నారు.
ఎంసీఎల్ జట్టును కొన్న సంజయ్ దత్
Published Sat, Oct 24 2015 12:51 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
Advertisement
Advertisement