టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
రాంచీ: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. గురువారం ఆస్ట్రేలియాతో ప్రపంచ కప్ సెమీస్లో భారత్ ఓటమి అనంతరం పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ధోనీ ఇంటి వద్ద అభిమానులు నిరసన ప్రదర్శనకు దిగడం లేదా అనుచిత చర్యలకు పాల్పడుతారనే సందేహంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ధోనీ కుటుంబ సభ్యులు జార్ఖండ్ రాజధాని రాంచీలో నివాసం ఉంటున్నారు.