పెళ్లి పీటలెక్కనున్న నల్లకలువ
పెళ్లి పీటలెక్కనున్న నల్లకలువ
Published Fri, Dec 30 2016 8:25 AM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM
టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ త్వరలోనే పెళ్లి కూతురు కానుంది. ఈ విషయాన్ని స్వయంగా సెరెనానే వెల్లడించింది. రెడ్డిట్ వెబ్ సైట్ వ్యవస్ధాపకుడు అలెక్సిస్ ఒహనియన్ తో సెరెనా కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జంట వాళ్ల రిలేషన్ షిప్ ను తర్వాతి మెట్టు ఎక్కించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇరువురికి నిశ్చితార్ధం జరగనుందని విలియమ్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే, పెళ్లి ఎప్పుడు అనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు.
Advertisement
Advertisement