
మూడు ఫార్మాట్లలో షకిబుల్ బెస్ట్!
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకిబుల్ హసన్ మరోసారి బెస్ట్ ఆల్ రౌండర్ స్థానాన్ని దక్కించుకున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో షకిబుల్ అన్ని ఫార్మాట్లలో ఉత్తమ ఆల్ రౌండర్ గా ఎంపికయ్యాడు. గత వరల్డ్ కప్ కు ముందు టెస్టు, వన్డే, ట్వంటీ 20 ఫార్మెట్లలో ఉత్తమ ఆల్ రౌండర్ స్థానాన్ని చేజిక్కించుకున్న షకిబుల్.. ఆ తరువాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లలో పేలవమైన ఆటతో తన స్థానాన్ని కోల్పోయాడు.
కాగా, బంగ్లాదేశ్-టీమిండియాల మధ్య జరిగిన టెస్టు, వన్డే సిరీస్ ల తరువాత విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్ లో షకిబుల్ మరోసారి ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాడు. దీంతో ఇప్పటివరకూ ఉత్తమ ఆల్ రౌండర్ గా ఉన్న శ్రీలంక ఆటగాడు తిలకరత్నేను దిల్షాన్ ను షకిబుల్ వెనక్కు నెట్టాడు. ప్రస్తుత పాయింట్ల ప్రకారం షకిబుల్ 408 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా, దిల్షాన్ 404 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.