సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలింగ్ హడావుడి ముగియడంతో స్పోర్ట్స్ అధికారులు ప్రత్యేక వేసవి శిక్షణ శిబిరాలపై దృష్టిపెట్టారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సిబ్బందికి శిక్షణ, తదుపరి సామాగ్రి బట్వాడా కోసం నగరంలోని వివిధ స్టేడియాల్ని వినియోగించుకోవడంతో ఈ ఏడాది శిక్షణ శిబిరాలు కాస్త ఆలస్యమయ్యాయి. దీంతో ఓటింగ్ ముగిసిన మరుసటి రోజునే ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) సికింద్రాబాద్‌లోని జింఖానా స్టేడియంలో గురువారం ఫుట్‌బాల్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించింది.
అండర్-16 బాలబాలికలకు సీనియర్ కోచ్ అలీమ్ ఖాన్ నేతృత్వంలో శిక్షణ ఇస్తున్నారు. తొలి రోజు సుమారు 150 మంది బాలబాలికలు ఈ శిబిరంలో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. దాదాపు నెల రోజులకు పైగా జరిగే ఈ శిబిరంలో రాబోయే రోజుల్లో శిక్షణకు వచ్చే బాలబాలికల సంఖ్య పెరుగుతుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో గత నెలలో ప్రారంభం కావాల్సిన వార్షిక వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు కూడా త్వరలోనే నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
‘శాప్’ వేసవి శిక్షణ షురూ
Published Thu, May 1 2014 11:43 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement