సాక్షి, ముంబై: స్వదేశంలో ఈ నెల 22 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులు గల భారత జట్టును శనివారం ప్రకటించింది. జట్టులోకి కొత్తగా యువ పేసర్ శార్ధుల్ ఠాకుర్, వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌లు చోటు దక్కించుకున్నారు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఒక్కసారి కూడా బ్యాటింగ్ అవకాశం రాని కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేయలేదు.
వ్యక్తిగత కారణాలతో ఆసీస్ వన్డే సిరీస్‌కు దూరమైన శిఖర్ ధావన్‌ను ఎంపిక చేశారు. సీనియర్ స్పిన్నర్లు అశ్విన్-జడేజాలకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆసీస్ పర్యటనలో రాణించిన యువ స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లనే కొనసాగించారు. ఈ సిరీస్ తొలి వన్డే అక్టోబర్ 22న ముంబైలో జరగనుంది.
జట్టు వివరాలు..
విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్‌శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అజింక్యా రహానే, మనీష్ పాండే, కేదార్‌జాదవ్, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, శార్ధుల్ ఠాకుర్.
Comments
Please login to add a commentAdd a comment