న్యూఢిల్లీ: భారతీయ ఓపెనర్ శిఖర్ ధావన్ లాక్‌డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పట్లో బ్యాటు పట్టే పరిస్థితులు కనిపించకపోవడంతో పాటలకు కాలు కదుపుతూ చిందులేస్తున్నాడు. తాజాగా అతను తన కొడుకు జొరావీర్‌తో కలిసి పాపులర్ సాంగ్ "ఆజ్ నచ్‌లే.." పాటకు డ్యాన్స్ చేశాడు. వీరిద్దరు డ్యాన్స్ చేసిందే కాకుండా శిఖర్ తన భార్య ఆయేషాను కూడా రావాలంటూ సైగ చేశాడు. అయితే ఆమె మాత్రం తన వల్ల కాదు, బాబోయ్ అంటూ కూర్చున్నచోట నుంచి అంగుళం కూడా జరగలేదు. (రోహిత్‌ను అమ్మాయిగా మార్చేశాడు..!)
"భార్యను ఒప్పించడానికి కొడుకు సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది" అంటూ ఈ డ్యాన్స్ వీడియోను శిఖర్ ధావన్ సోమవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫన్నీ డ్యాన్స్‌కు అభిమానులు కామెంట్లు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ దొరికిందే ఛాన్సని స్నేహితుడైన ధావన్‌ను ఏడిపించే ప్రయత్నం చేశాడు. "ఒకవేళ వదిన కానీ డ్యాన్స్ చేస్తే జొరా నిన్ను విడిచిపెట్టి ఆమెవైపే ఉంటాడు" అని కౌంటర్ ఇచ్చాడు. ఇదిలా వుండగా "ఎప్పుడూ కొడుకుతో కలిసే వీడియోలు చేస్తారేంటి?" అని ఓ నెటిజన్ శిఖర్‌ను ప్రశ్నించగా.. కూతుర్లిద్దరూ (అలియా,రియా) మెల్‌బోర్న్‌లో ఉన్నారని, అందుకే వారితో కలిసి వీడియోలు చేయలేకపోతున్నానని చెప్పాడు. (‘నన్ను 15 పరుగుల బ్యాట్స్‌మన్ అన్నారు’)
Comments
Please login to add a commentAdd a comment