సఫారీల చేతిలో ధోని సేన చిత్తు
డర్బన్: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలయింది. ఆతిథ్య జట్టు చేతిలో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ను 1-0తో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. టీమిండియా నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా వికెట్లేమి నష్టపోకుండా ఛేదించింది. 11.4 ఓవర్లలో 59 పరుగులు చేసింది. స్మిత్ 27, పీటర్సన్ 31 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.
అంతకుముందు రెండో ఇన్నింగ్స్లో ధోని సేన 223 పరుగులకు ఆలౌటయింది. అజింక్య రహానే ఒక్కడే రాణించి 96 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. స్టెయిన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', డీవిలియర్స్ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అందుకున్నారు. జోహెన్నెస్ బర్గ్లో జరిగిన తొలి టెస్టు డ్రా అయిన సంగతి తెలిసిందే.