దక్షిణాఫ్రికా లక్ష్యం 438 | South Africa Needs To Score 438 Against England | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా లక్ష్యం 438

Published Tue, Jan 7 2020 12:35 AM | Last Updated on Tue, Jan 7 2020 12:35 AM

South Africa Needs To Score 438 Against England - Sakshi

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 438 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. డొమినిక్‌ సిబ్లీ అజేయ శతకానికి (311 బంతుల్లో 133 నాటౌట్‌; 19 ఫోర్లు, సిక్స్‌)... స్టోక్స్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ (47 బంతుల్లో 72; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) తోడవ్వడంతో... ఓవర్‌నైట్‌ స్కోర్‌ 218/4తో సోమవారం బ్యాటింగ్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ జట్టు 8 వికెట్లకు 391 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

ఫలితంగా 437 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. సిబ్లీకిదే తొలి టెస్టు సెంచరీ కావటం విశేషం. కెప్టెన్‌ రూట్‌ (61; 7 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాడు. నోర్జే 3 వికెట్లతో రాణించాడు. అనంతరం ఛేదన ప్రారంభించిన ప్రొటీస్‌ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. ఓపెనర్లు ఎల్గర్‌ (34; 2 ఫోర్లు,), మలాన్‌ (62 బ్యాటింగ్‌; 2 ఫోర్లు) తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించి శుభారంభం చేశారు. ప్రస్తుతం పీటర్‌ మలాన్‌కు తోడుగా మహరాజ్‌ (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. ఆటకు నేడు చివరి రోజు కాగా విజయానికి 312 పరుగుల దూరంలో దక్షిణాఫ్రికా... 8 వికెట్ల దూరంలో ఇంగ్లండ్‌ ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement