ఇంగ్లండ్, పాక్‌ టెస్టుకు వర్షం దెబ్బ | Second Test Match Ends With Draw Between England VS Pakistan | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్, పాక్‌ టెస్టుకు వర్షం దెబ్బ

Published Mon, Aug 17 2020 1:27 AM | Last Updated on Mon, Aug 17 2020 1:27 AM

Second Test Match Ends With Draw Between England VS Pakistan - Sakshi

సౌతాంప్టన్‌: మరోసారి వర్షం అంతరాయం కలిగించడంతో ఇంగ్లండ్, పాకిస్తాన్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు ‘డ్రా’గా ముగియడం ఖాయమైంది. నాలుగో రోజు కేవలం 10.2 ఓవర్ల ఆట సాధ్యమైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 223/9తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాక్‌ 236 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్‌ రిజ్వాన్‌ (72; 7 ఫోర్లు) బ్రాడ్‌ బౌలింగ్‌లో క్రాలీకి క్యాచ్‌ ఇచ్చి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్టువర్ట్‌ బ్రాడ్‌ (4/56), అండర్సన్‌ (3/60) రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ 5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 7 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. సోమవారం మ్యాచ్‌కు చివరి రోజు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement