కేప్‌టౌన్: గత కొంతకాలంగా కరోనా వైరస్ విజృంభించడంతో విదేశీ ప్రయాణాలకు ఏ దేశం కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీని ప్రభావం క్రీడలపై కూడా ఎక్కువగానే పడింది. కరోనా వైరస్ భయంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ టోర్నీలు రద్దయ్యాయి. కాగా, త్వరలో భారత్ పర్యటనకు దక్షిణాఫ్రికా రానున్నట్లు తెలిపింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారమే తాము భారత్ పర్యటనకు రానున్నట్లు క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్‌ఏ) స్పష్టం చేసింది. తాము కరోనా భయంతో పర్యటనను రద్దు చేసుకోవట్లేదని పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.(అంతర్జాతీయ టోర్నీలకు కోవిడ్–19 దెబ్బ)
‘ భారత్ పర్యటనకు రావడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కరోనా వైరస్‌పై ఆందోళన లేదు. మేము దుబాయ్ మీదుగా భారత్‌కు వస్తాం. ఈ క్రమంలోనే ఢిల్లీలో ఒక రోజు ఉంటాం. ఇక మ్యాచ్‌లు జరిగే ధర్మశాల, లక్నో, కోల్‌కతాలకు ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తాం. మ్యాచ్‌లు జరుగనున్న వేదికల్లో కరోనా కేసులు నమోదు కాలేదు. దుబాయ్, ఢిల్లీల్లో కూడా కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉంది’ అని సీఎస్‌ఏ తన ప‍్రకటనలో తెలిపింది. మరో రెండు-మూడు రోజుల్లో భారత్ పర్యటనకు సఫారీలు రానున్నారు. మార్చి 12వ తేదీన ధర్మశాల వన్డేతో ఇరు దేశాల ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానుంది. మార్చి 15వ తేదీన లక్నోలో రెండో వన్డే, మార్చి 18వ తేదీన కోల్‌కతాలో మూడో వన్డే జరుగనుంది. (కరోనా భయం.. ఐపీఎల్ సాధ్యమేనా?)
Comments
Please login to add a commentAdd a comment