ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: వెస్ట్‌జోన్ జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ క్విజ్ పోటీల్లో హర్ష, రోహన్ జోడి(కేపీహెచ్‌బీ పీజీ-కరాటే) విజేతలుగా నిలిచారు. వెస్ట్‌జోన్ జీహెచ్‌ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లో భాగంగా స్పోర్ట్స్ క్విజ్ పోటీలు చందానగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మంగళవారం జరిగాయి.
ఈ పోటీల్లో మణి కుమార్, అనూప్ జోడి (కేపీహెచ్‌పీజీ-వాలీబాల్) రెండో స్థానం పొందింది. కృష్ణ, రాకేష్ జోడి (భరత్ నగర్ ప్లేగ్రౌండ్-క్రికెట్) మూడో స్థానం సాధించింది. విజేతలకు జీహెచ్‌ఎంసీ వెస్ట్‌జోన్ కమిషనర్ ఆలీమ్ బాషా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ పి.అశోక్ గౌడ్, స్పోర్ట్స్ డెరైక్టర్ డాక్టర్ ఎస్.ఆర్.ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
స్పోర్ట్స్ క్విజ్ విజేతలు హర్ష, రోహన్
Published Wed, May 28 2014 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM
Advertisement
Advertisement