Sports Quiz
-
స్పోర్ట్స్ క్విజ్ విజేతలు హర్ష, రోహన్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: వెస్ట్‌జోన్ జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ క్విజ్ పోటీల్లో హర్ష, రోహన్ జోడి(కేపీహెచ్‌బీ పీజీ-కరాటే) విజేతలుగా నిలిచారు. వెస్ట్‌జోన్ జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లో భాగంగా స్పోర్ట్స్ క్విజ్ పోటీలు చందానగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మంగళవారం జరిగాయి. ఈ పోటీల్లో మణి కుమార్, అనూప్ జోడి (కేపీహెచ్పీజీ-వాలీబాల్) రెండో స్థానం పొందింది. కృష్ణ, రాకేష్ జోడి (భరత్ నగర్ ప్లేగ్రౌండ్-క్రికెట్) మూడో స్థానం సాధించింది. విజేతలకు జీహెచ్ఎంసీ వెస్ట్‌జోన్ కమిషనర్ ఆలీమ్ బాషా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ పి.అశోక్ గౌడ్, స్పోర్ట్స్ డెరైక్టర్ డాక్టర్ ఎస్.ఆర్.ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
స్పోర్ట్స్ క్విజ్..
1. క్రికెట్ లో కాకుండా ఏ క్రీడాంశంలో జాంటీ రోడ్స్ దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ఆడాడు? 2. ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు తొలి వ్యక్తిగత పతకాన్ని అందించిన వారెవరు? 3. భారత్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడిన తొలి, ఏకైక కవల క్రికెటర్ల జోడి? 4. ఒలింపిక్స్‌లో హాకీ తర్వాత ఏ క్రీడాంశాల్లో భారత్‌కు అత్యధిక పతకాలు వచ్చాయి? 5. ‘పోలో’ క్రీడలో ఒక జట్టు తరఫున ఎంత మంది ఆడాలి? జవాబులు: 1. హాకీ 2. రెజ్లర్ ఖాషాబా జాదవ్ (1952 హెల్సింకి-కాంస్యం) 3. బాబా అపరాజిత్, బాబా ఇంద్రజిత్ (తమిళనాడు-2013లో) 4. రెజ్లింగ్, షూటింగ్ (నాలుగేసి చొప్పున) 5. నలుగురు చొప్పున