స్పోర్ట్స్ స్కూల్‌కే టైటిల్ | sports school wins foot ball title | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్ స్కూల్‌కే టైటిల్

Published Thu, Aug 25 2016 10:42 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

sports school wins foot ball title

హైదరాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన రంగారెడ్డి జిల్లా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో స్పోర్ట్స్ స్కూల్ జట్టు చాంపియన్‌గా నిలిచింది.

సరూర్‌నగర్‌లోని వి.ఎం. హోమ్ మైదానంలో బుధవారం జరిగిన అండర్-17 బాలుర ఫైనల్లో స్పోర్ట్స్ స్కూల్ జట్టు 1-0తో గ్లెన్‌డేల్ అకాడమీపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో గ్లెన్‌డేల్ అకాడమీ 8-7తో డీపీఎస్, నాచారంపై గెలుపొందగా... మరో మ్యాచ్‌లో స్పోర్ట్స్ స్కూల్ 2-1తో ఓక్రిడ్జ్ స్కూల్‌పై నెగ్గింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement