అబుదాబి: క్రికెట్ కూనల దెబ్బకు శ్రీలంక తలవంచింది. ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో లీగ్ దశలోనే వెనుదిరిగింది. లంకను తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చితక్కొడితే... సోమవారం జరిగిన గ్రూప్ ‘బి’ రెండో మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ అదరగొట్టింది. దీంతో 91 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. మొదట అఫ్గానిస్తాన్ 249 పరుగులు చేసి ఆలౌటైంది. రహ్మత్ షా (72; 5 ఫోర్లు) రాణించాడు. తిసారా పెరీరా 5 వికెట్లు తీశాడు. తర్వాత శ్రీలంక 41.2 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటై ఓడింది. చెరో విజయంతో గ్రూప్ ‘బి’ నుంచి బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ సూపర్–4 దశకు అర్హత సాధించాయి.
రహ్మత్ షా అర్ధసెంచరీ
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న క్రికెట్ కూనను టాపార్డర్ బ్యాట్స్‌మెన్ నిలబెట్టారు. ఓపెనర్లు షహజాద్ (34; 4 ఫోర్లు, 1 సిక్స్), ఇహ్‌షానుల్లా (45; 6 ఫోర్లు) తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించి శుభారంభమిచ్చారు. తర్వాత రహ్మత్ షా అఫ్గాన్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 63 బంతుల్లో మూడు బౌండరీల సాయంతో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న రహ్మత్ షా... హస్మతుల్లా షాహిది (37; 2 ఫోర్లు)తో కలిసి మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించాడు. తర్వాత 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకకు రెండో బంతి నుంచే కష్టాలు మొదలయ్యాయి. కుశాల్ మెండిస్ (0)ను ముజీబ్ డకౌట్ చేశాడు. తర్వాత తరంగ (36; 3 ఫోర్లు), డిసిల్వా (23; 2 ఫోర్లు, 1 సిక్స్) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా... అనంతరం వచ్చిన బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు.
స్కోరు వివరాలు
అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: షహజాద్ ఎల్బీడబ్ల్యూ (బి) ధనంజయ 34; ఇహ్‌షానుల్లా ఎల్బీడబ్ల్యూ (బి) ధనంజయ 45; రహ్మత్ షా (సి) తిసారా పెరీరా (బి) చమిర 72; అస్గర్ ఎల్బీడబ్ల్యూ (బి) జయసూర్య 1; షాహిది (బి) తిసార పెరీరా 37; నబీ (సి) తిసారా పెరీరా (బి) మలింగ 15; జద్రాన్ (బి) తిసారా పెరీరా 12; గుల్బదిన్ నయీబ్ (సి) ధనంజయ (బి) పెరీరా 4; రషీద్ ఖాన్ (బి) తిసారా పెరీరా 13; ఆఫ్తాబ్ నాటౌట్ 7; ముజీబ్ (బి) తిసారా పెరీరా 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 249.
వికెట్ల పతనం: 1–57, 2–107, 3–110, 4–190, 5–203, 6–222, 7–227, 8–242, 9–249, 10–249. బౌలింగ్: మలింగ 10–0–66–1, చమీర 10–2–43–1, తిసారా పెరీరా 9–0–55–5, ధనంజయ 10–0–39–2, డిసిల్వా 5–0–22–0, జయసూర్య 6–0–22–1.
శ్రీలంక ఇన్నింగ్స్: కుశాల్ మెండిస్ ఎల్బీడబ్ల్యూ (బి) ముజీబ్ 0; తరంగ (సి) అస్ఘర్ (బి) నయీబ్ 36; డిసిల్వా రనౌట్ 23; కుశాల్ పెరీరా (బి) రషీద్ ఖాన్ 17; ఏంజెలో మాథ్యూస్ (సి) రషీద్ ఖాన్ (బి) నబీ 22; జయసూర్య రనౌట్ 14; తిసారా పెరీరా (బి) నయీబ్ 28; షనక (బి) ముజీబ్ 0; ధనంజయ (బి) నబీ 2; మలింగ ఎల్బీడబ్ల్యూ (బి) రషీద్ ఖాన్ 1; చమీర నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (41.2 ఓవర్లలో ఆలౌట్) 158.
వికెట్ల పతనం: 1–0, 2–54, 3–86, 4–88, 5–108, 6–143, 7–144, 8–153, 9– 156, 10–158. బౌలింగ్: ముజీబ్ 9–1–32–2, ఆఫ్తాబ్ ఆలమ్ 7–0–34–0, నయీబ్ 8–0–29–2, నబీ 10–1–30–2, రషీద్ ఖాన్ 7.2–0–26–2.
శ్రీలంక ఔట్
Published Tue, Sep 18 2018 12:57 AM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment