తొడ కండరాల గాయం కారణంగా నాలుగో టెస్టుకు దూరమైన ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ జాన్సన్ స్థానంలో మిషెల్ స్టార్క్ ను తీసుకున్నారు.
సిడ్నీ: తొడ కండరాల గాయం కారణంగా నాలుగో టెస్టుకు దూరమైన ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ జాన్సన్ స్థానంలో మిషెల్ స్టార్క్ ను తీసుకున్నారు. ఈ ఒక్క మార్పుతోనే ఆసీస్ జట్టు బరిలోకి దిగనుందని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. గత వారం జరిగిన మూడో టెస్టులో 33 ఏళ్ల జాన్సన్ గాయపడ్డాడు.
ఉదర సమస్యతో బాధపడుతున్న ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ కోలుకున్నాడు. నాలుగు టెస్టుల సిరీస్ ను ఆస్ట్రేలియా 2-0తో గెల్చుకున్న సంగతి తెలిసిందే.