
స్టీవ్ స్మిత్ శతకం
బ్రిస్బేన్: మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఇక్కడ పాకిస్తాన్తో జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టులో ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ శతకం సాధించాడు. తొలి రోజు ఆటలో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(32), రెన్ షా(71)లు చక్కటి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 70 పరుగులు జోడించిన తరువాత వార్మర్ తొలి వికెట్ గా అవుటయ్యాడు.ఆ తరువాత ఖవాజా(4) వెంటనే పెవిలియన్ చేరడంతో ఆసీస్ తడబడినట్లు కనిపించింది.
ఆ తరుణంలో బ్యాటింగ్ కొచ్చిన స్మిత్ జట్టు పరిస్థితిని చక్కదిద్దాడు.రెన్ షాతో కలిసి 76 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశాడు. ఆపై హ్యాండ్ స్కాంబ్(64 బ్యాటింగ్)తో కూడా మరో కీలక భాగస్వామ్యాన్ని సాధించాడు. ఈ క్రమంలోనే స్మిత్(110 బ్యాటింగ్) శతకం నమోదు చేశాడు. దాంతో ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.