
పరాజయం పరిపూర్ణం
శనివారమే విజయాన్ని ఖాయం చేసుకొని డేవిస్ కప్‌లో వరల్డ్ గ్రూప్‌నకు అర్హత సాధించిన స్పెయిన్ జట్టు నామమాత్రపు రివర్స్
న్యూఢిల్లీ: శనివారమే విజయాన్ని ఖాయం చేసుకొని డేవిస్ కప్‌లో వరల్డ్ గ్రూప్‌నకు అర్హత సాధించిన స్పెయిన్ జట్టు నామమాత్రపు రివర్స్ సింగిల్స్‌లోనూ జోరు కనబరిచింది. భారత్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేసి సగర్వంగా తిరిగి వెళ్తోంది. 1965 తర్వాత స్పెయిన్‌తో మళ్లీ తలపడిన భారత్ డేవిస్‌కప్‌లో 0-5తో వైట్‌వాష్ కావడం 13 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2003లో నెదర్లాండ్‌సతో జరిగిన వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌లోనూ భారత్ ఒక్క విజయం కూడా సాధించలేదు. ఓవరాల్‌గా డేవిస్ కప్‌లో చరిత్రలో 0-5తో భారత్ ఓడటం ఇది 21వసారి.
నామమాత్రపు మ్యాచ్‌లు కావడంతో తొలి రివర్స్ సింగిల్స్‌లో సాకేత్ మైనేని బదులు కొత్త ఆటగాడు సుమిత్ నాగల్‌ను భారత్ బరిలోకి దించగా.. స్పెయిన్ జట్టు డబుల్స్ స్పెషలిస్ట్ మార్క్ లోపెజ్‌ను ఆడించింది. డేవిస్ కప్‌లో కేవలం రెండోసారి సింగిల్స్ మ్యాచ్ ఆడిన మార్క్ లోపెజ్ 6-3, 1-6, 6-3తో సుమిత్‌ను ఓడించి స్పెయిన్ ఆధిక్యాన్ని 4-0కు పెంచాడు. రెండో రివర్స్ సింగిల్స్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ డేవిడ్ ఫెరర్ 6-2, 6-2తో రామ్‌కుమార్ రామనాథన్‌ను ఓడించి స్పెయిన్ విజయాన్ని పరిపూర్ణం చేశాడు.