బాకు (అజర్‌బైజాన్): ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు సతీశ్ (+91 కేజీలు), సుమిత్ సాంగ్వాన్ (81 కేజీలు) శుభారంభం చేశారు. తొలి రౌండ్‌లో ఆసియా క్రీడల కాంస్య పతక విజేత సతీశ్‌కుమార్ 3-0 తేడాతో మాన్సే కహో రైకడ్రోగా (టోంగా) పై విజయం సాధించాడు. మరో బౌట్‌లో సుమిత్ 3-0 తేడాతో ఆండ్రూ ఫెర్మిన్ (ట్రినిడాడ్)ను ఓడించాడు.
రెండో రౌండ్‌లో సతీశ్... డీన్ గార్డినర్ (ఐర్లాండ్)తో, సుమిత్... జున్ కార్లోస్ కారిలో పలాసియో (కొలంబియా)తో తలపడతారు. 60 కే జీల విభాగంలో భారత్‌కు చెందిన ధీరజ్ 1-2 తేడాతో టాప్ సీడ్ లిండాల్ఫో గర్జా (మెక్సికో) చేతిలో ఓటమి పాలయ్యాడు. రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడానికి అమెచ్యూర్ బాక్సర్లకు చివరిదైన ఈ టోర్నీలో 100 దేశాలకు చెందిన బాక్సర్లు పోటీపడుతున్నారు.
సుమిత్ శుభారంభం
Published Sun, Jun 19 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM
Advertisement
Advertisement