World Olympic qualifying
-
Wrestler Gurpreet Singh: గుర్‌ప్రీత్‌కు కాంస్యం
సోఫియా (బల్గేరియా): వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ రెజ్లింగ్ టోర్నమెంట్‌ను భారత్ కాంస్య పతకంతో ముగించింది. టోర్నీ చివరి రోజు ఆదివారం పురుషుల గ్రీకో రోమన్ 77 కేజీల విభాగంలో గుర్ప్రీత్ సింగ్ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించాడు. కాంస్య పతక బౌట్లో గుర్ప్రీత్ 4–2 పాయింట్ల తేడాతో విక్టర్ నెమిస్ (సెర్బియా)పై విజయం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌కు ఇదే చివరి అర్హత టోర్నీకాగా... ఈ టోర్నీ ద్వారా భారత్ రెండు ఒలింపిక్ బెర్త్‌లను ఖరారు చేసుకుంది. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో సుమిత్ మలిక్ (125 కేజీలు) రజతం నెగ్గి, మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో సీమా బిస్లా (50 కేజీలు) స్వర్ణ పతకం సాధించి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. కేవలం ఫైనల్‌కు చేరిన రెజ్లర్లే ఒలింపిక్ బెర్త్‌లు దక్కించుకున్నారు. గ్రీకో రోమన్ విభాగం 77 కేజీల విభాగంలో గుర్ప్రీత్ సింగ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయాడు. అయితే గుర్ప్రీత్ సింగ్‌ను ఓడించిన రఫీగ్ హుసెనోవ్ (అజర్బైజాన్) ఫైనల్‌కు చేరుకోవడంతో గుర్ప్రీత్ సింగ్‌కు ‘రెపిచాజ్’ పద్ధతిలో కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం దక్కింది. -
భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
సోఫియా (బల్గేరియా): టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు భారత రెజ్లర్లు చివరి ప్రయత్నం చేయనున్నారు. నేటి నుంచి బల్గేరియా రాజధాని సోఫియాలో జరగనున్న వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో మొత్తం 12 బెర్త్‌ల కోసం భారత రెజ్లర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ టోర్నీలో పురుషుల ఫ్రీస్టయిల్, గ్రీకో రోమన్... మహిళల ఫ్రీస్టయిల్ విభాగాలలో 84 దేశాల నుంచి 400 మందికిపైగా రెజ్లర్లు 18 వెయిట్ కేటగిరీలలో బరిలోకి దిగనున్నారు. ప్రతి వెయిట్ కేటగిరీలో ఫైనల్‌కు చేరిన ఇద్దరు రెజ్లర్లకు టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌లు ఖరారవుతాయి. ► తొలి రోజు పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో 57, 65, 74, 86, 97, 125 కేజీల విభాగాల్లో పోటీలుంటాయి. ఇప్పటికే భారత్ నుంచి ఫ్రీస్టయిల్ విభాగంలో రవి (57 కేజీలు), బజరంగ్ పూనియా (65 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. ► చివరి క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ నుంచి ఫ్రీస్టయిల్లో మిగిలిన మూడు బెర్త్‌ల కోసం అమిత్ ధన్కర్ (74 కేజీలు), సత్యవర్త్ కడియాన్ (97 కేజీలు), సుమిత్ మలిక్ (125 కేజీలు) పోటీపడనున్నారు. ► పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో ఆరు వెయిట్ కేటగిరీలలో ఇప్పటి వరకు భారత్ నుంచి ఒక్కరు కూడా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయారు. చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సచిన్ రాణా (60 కేజీలు), ఆశు (67 కేజీలు), గుర్ప్రీత్ సింగ్ (77 కేజీలు), సునీల్ (87 కేజీలు), దీపాంశు (97 కేజీలు), నవీన్ (130 కేజీలు) బరిలో ఉన్నారు. ► మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్ నుంచి వినేశ్ ఫొగాట్ (53 కేజీలు), అన్షు మలిక్ (57 కేజీలు), సోనమ్ మలిక్ (62 కేజీలు) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. మిగిలిన మూడు బెర్త్‌ల కోసం ఆఖరి క్వాలిఫయింగ్ టోర్నీలో సీమా బిస్లా (50 కేజీలు), నిషా (68 కేజీలు), పూజా (76 కేజీలు) రేసులో ఉన్నారు. -
Wrestler Sushil Kumar: సుశీల్‌కు మొండిచేయి
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక భారత క్రీడాకారుడు, స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ మూడో ఒలింపిక్ పతకం సాధించాలనుకున్న ఆశలు ఆవిరయ్యాయి. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు చివరి టోర్నమెంట్ అయిన వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొనే భారత ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ జట్టును గురువారం ప్రకటించారు. ఈ టోర్నీ మే 6 నుంచి 9 వరకు బల్గేరియా రాజధాని సోఫియాలో జరుగుతుంది. ► 74 కేజీల విభాగంలో భారత్ తరఫున ఆసియా మాజీ చాంపియన్ అమిత్ ధన్కర్ బరిలోకి దిగనున్నాడు. మార్చి 16న నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్ టోర్నీకి పూర్తిస్థాయి ఫిట్నెస్ లేని కారణంగా సుశీల్ కుమార్ దూరంగా ఉన్నాడు. ఆ ట్రయల్స్ టోర్నీలో 74 కేజీల విభాగంలో సందీప్ సింగ్ మాన్ విజేతగా నిలువగా... అమిత్ ధన్కర్ రన్నరప్‌గా నిలిచాడు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నిబంధనల ప్రకారం ఒలింపిక్ బెర్త్ సాధించిన రెజ్లరే ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. చివరి క్వాలిఫయింగ్ టోర్నీకి సుశీల్ ఎంపిక కాకపోవడంతో అతనికి టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. 37 ఏళ్ల సుశీల్ కుమార్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం (66 కేజీలు), 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకం (66 కేజీలు) సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో సుశీల్‌కు పోటీపడే అవకాశం రాలేదు. ‘ప్రస్తుత కరోనా కల్లోల పరిస్థితుల్లో ప్రాణాలతో ఉండటమే ముఖ్యం. జట్టు ఎంపిక గురించి నేను డబ్ల్యూఎఫ్ఐతో ఇంకా మాట్లాడలేదు. త్వరలోనే ఈ విషయంపై వారితో చర్చిస్తాను’ అని సుశీల్ వ్యాఖ్యానించాడు. ► ట్రయల్స్ టోర్నీ విజేతగా నిలిచిన సందీప్ సింగ్‌ను కజకిస్తాన్‌లో జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీకి, ఆసియా చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపిక చేశారు. అయితే ఈ రెండు టోర్నీలలో సందీప్ సింగ్ విఫలమయ్యాడు. దాంతో వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం సందీప్ సింగ్‌ను పక్కనబెట్టి సెలక్షన్ టోర్నీ రన్నరప్ అమిత్ ధనకర్‌కు ఎంపిక చేశారు. ►వాస్తవానికి వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం మళ్లీ ట్రయల్స్ నిర్వహించాలని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) భావించింది. అయితే దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా శిక్షణ శిబిరాలు మూతబడ్డాయి. దాంతో ట్రయల్స్ లేకుండానే తొలి ట్రయల్స్ టోర్నీ ఆధారంగా అమిత్‌కు అవకాశం ఇచ్చారు. ►74 కేజీల విభాగంలో మరో స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ట్రయల్స్ టోర్నీలో సెమీఫైనల్లో ఓడిపోవడంతో అతను కూడా టోక్యో ఒలింపిక్స్ అవకాశాలు కోల్పోయాడు. ►ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్‌కు ఇప్పటికే మూడు ఒలింపిక్ బెర్త్‌లు (రవి–57 కేజలు; బజరంగ్–65 కేజీలు; దీపక్ పూనియా–86 కేజీలు) ఖరారయ్యాయి. మరో మూడు బెర్త్‌లు (74 కేజీలు, 97 కేజీలు, 125 కేజీలు) మిగిలి ఉన్నాయి. 97 కేజీల విభాగంలో సత్యవర్త్... 125 కేజీల విభాగంలో సుమిత్ వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీ లో పోటీపడనున్నారు. ఈ టోర్నీలో ఫైనల్ చేరిన వారికి ఒలింపిక్ బెర్త్‌లు ఖాయమవుతాయి. ►వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొనే భారత గ్రీకో రోమన్ పురుషుల జట్టును కూడా ప్రకటించారు. సచిన్ రాణా (60 కేజీలు), ఆశు (67 కేజీలు), గుర్ప్రీత్ సింగ్ (77 కేజీలు), సునీల్ (87 కేజీలు), దీపాంశు (97 కేజీలు), నవీన్ కుమార్ (130 కేజీలు) భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. ►మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీలో మూడు ఒలింపిక్ బెర్త్‌ల కోసం సీమా (50 కేజీలు)... నిషా (68 కేజీలు)... పూజా (76 కేజీలు) పోటీపడతారు. ఈ టోర్నీలో ఫైనల్ చేరిన వారికి ఒలింపిక్ బెర్త్‌లు లభిస్తాయి. -
సుమిత్ శుభారంభం
బాకు (అజర్బైజాన్): ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు సతీశ్ (+91 కేజీలు), సుమిత్ సాంగ్వాన్ (81 కేజీలు) శుభారంభం చేశారు. తొలి రౌండ్లో ఆసియా క్రీడల కాంస్య పతక విజేత సతీశ్‌కుమార్ 3-0 తేడాతో మాన్సే కహో రైకడ్రోగా (టోంగా) పై విజయం సాధించాడు. మరో బౌట్లో సుమిత్ 3-0 తేడాతో ఆండ్రూ ఫెర్మిన్ (ట్రినిడాడ్)ను ఓడించాడు. రెండో రౌండ్లో సతీశ్... డీన్ గార్డినర్ (ఐర్లాండ్)తో, సుమిత్... జున్ కార్లోస్ కారిలో పలాసియో (కొలంబియా)తో తలపడతారు. 60 కే జీల విభాగంలో భారత్‌కు చెందిన ధీరజ్ 1-2 తేడాతో టాప్ సీడ్ లిండాల్ఫో గర్జా (మెక్సికో) చేతిలో ఓటమి పాలయ్యాడు. రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడానికి అమెచ్యూర్ బాక్సర్లకు చివరిదైన ఈ టోర్నీలో 100 దేశాలకు చెందిన బాక్సర్లు పోటీపడుతున్నారు.