అహ్మదాబాద్:సొంతవేదికపై జరిగిన తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఘోర పరాజయాన్నిచవిచూసింది. ఐపీఎలో 7 లో భాగంగా ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సన్ రైజర్స్ విసిరిన 135 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన రాజస్థాన్ కు ఆదిలోనే అజాంకే రహానే(0)కే పెవిలియన్ కు చేరి నిరాశపరిచాడు. అనంతరం శ్యామ్ సన్ (16), నాయర్ (12), వాట్సన్ (11), బిన్ని (12) ఇలా ఒక్కొక్కరూ తక్కువ పరుగులకే పరిమితమై రాజస్థాన్ ఓటమికి కారణమైయ్యారు. కాగా, ఈ మ్యాచ్ స్మిత్ (22) పరుగులు చేసి రాజస్థాన్ ఆటగాళ్లలో టాప్ స్కోర్ గా నిలిచాడు. కడవరకూ పోరాడిన రాజస్థాన్ 102 పరుగులకే పరిమితమై మరో పరాజయం మూటగట్టుకుంది. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లు లభించగా, స్టెయిన్ కు రెండు వికెట్లు లభించాయి.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ 135 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఓపెనర్ ఫించ్ (9) పెవిలియన్ కు చేరి హైదరాబాద్ అభిమానులకు షాకిచ్చాడు. అనంతరం శిఖర్ థావన్ తో కలిసిన రాహుల్ జట్టు స్కోరును ముందుకు తీసుకువెళ్లే యత్నం చేశారు. కాగా శిఖర్(33), రాహుల్ (18) పరుగులకు పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ స్కోరు మందగించింది.తరువాత వచ్చిన ఆటగాళ్లలో నమాన్ ఓజా(17),ఇర్ఫాన్ పఠాన్(21)లు ఫర్వాలేదనిపించారు. దీంతో హైదరాబాద్ సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్ బౌలర్లలో వాట్సన్, భాటియాలకు తలో మూడు వికెట్లు లభించాయి.
హైదరాబాద్ పై రాజస్థాన్ రాయల్స్ ఘోర పరాజయం
Published Thu, May 8 2014 11:27 PM | Last Updated on Sat, Sep 2 2017 7:05 AM
Advertisement