రాజస్థాన్ రాయల్స్ విజయలక్ష్యం135
అహ్మదాబాద్: ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 135 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేయాల్సిందిగా హైదరాబాద్ ను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఫించ్ (9) పెవిలియన్ కు చేరి హైదరాబాద్ అభిమానులకు షాకిచ్చాడు. అనంతరం శిఖర్ థావన్ తో కలిసిన రాహుల్ జట్టు స్కోరును ముందుకు తీసుకువెళ్లే యత్నం చేశారు. కాగా శిఖర్(33), రాహుల్ (18) పరుగులకు పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ స్కోరు మందగించింది.
తరువాత వచ్చిన ఆటగాళ్లలో నమాన్ ఓజా(17),ఇర్ఫాన్ పఠాన్(21)లు ఫర్వాలేదనిపించారు. దీంతో హైదరాబాద్ సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేసింది. హైదరాబాద్ ఆటగాళ్లలో ఏడుగరు సింగిల్ డిజిట్ కే పరిమితవడం గమనార్హం. రాజస్థాన్ బౌలర్లలో వాట్సన్, భాటియాలకు తలో మూడు వికెట్లు లభించాయి.