
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ వాంఖేడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ తొలి బంతికే శిఖర్ ధావన్ పెవిలియన్ చేరగా, జట్టు స్కోరు 34 పరుగుల వద్ద ఉండగా గోస్వామి(12) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై మరో రెండు పరుగుల వ్యవధిలో కేన్ విలియమ్సన్(24) మూడో వికెట్‌గా పెవిలియన్ బాటపట్టాడు. అటు తర్వాత షకిబుల్ హసన్(12) నిరాశపరిచాడు.
చెన్నై అటాకింగ్ ఓవర్‌ను వేసిన చాహర్ బౌలింగ్‌లో తొలి బంతికే ధావన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ తరుణంలో గోస్వామి-విలియమ్సన్‌ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. అయితే లుంగి ఎంగిడి బౌలింగ్‌లో గోస్వామి రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాసేపటికి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు యత్నించిన విలియమ్సన్.. కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఇక బ్రేవో బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చిన షకిబుల్ నాల్గో వికెట్‌గా నిష్క్రమించాడు.
Comments
Please login to add a commentAdd a comment