సాక్షి, స్పోర్ట్స్: ఐపీఎల్-2018 సీజన్‌కు సంబంధించి విడుదల చేసిన సన్‌రైజర్స్ స్లోగన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘గో గో గో గో హియర్ వి గో గో గో... వియ్ ఆర్ ది ఆరెంజ్ ఆర్మీ’ అనే స్లోగన్‌ను సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ అధికారిక ట్విటర్ పేజీలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ స్లోగన్ సోషల్ మీడియాలో హోరెత్తుతోంది.
టోర్నీ ప్రారంభానికి ఇంకా మూడు వారాల సమయం ఉన్నా ఫ్రాంచైజీలు ప్రచార కార్యక్రమాల్లో అప్పుడే బీజీ అయిపోయాయి. ఇక ఏప్రిల్ 7 న మంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏప్రిల్ 9న రాజస్థాన్ రాయల్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment