న్యూఢిల్లీ: గాల్వాన్ లోయలో మృతి చెందిన జవాన్లపై, కేంద్ర ప్రభుత్వంపై వివాదాస్పద ట్వీట్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ వైద్యుడు మధు తొట్టప్పిలిల్ గురువారం బేషరతు క్షమాపణ చెప్పాడు. సంక్షోభ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలను తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. తన చర్య పట్ల బాధ పడిన ప్రతీ ఒక్కరికి క్షమాపణ చెబుతున్నానని అన్నాడు. ‘జూన్ 16న నేను చేసిన ట్వీట్‌లో వాడిన పదాలు సరైనవి కావని తర్వాత తెలుసుకున్నా. వెంటనే దాన్ని తొలగించా. కానీ అప్పటికే అది సామాజిక మాధ్యమాల్లోకి వెళ్లిపోయింది. దేశ పౌరుల కోసం, ఆర్మీ కోసం కేంద్రం తీసుకునే నిర్ణయాలను గౌరవిస్తా. నా ట్వీట్ వేలాది మంది భారతీయుల మనోభావాల్ని దెబ్బతీసింది. దానికి చింతిస్తున్నా. హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నా’ అని రాసుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment