యూఎస్ ఓపెన్లో స్విస్ వీరుల జోరు | swiss players rocking in US open grandslam | Sakshi
Sakshi News home page

యూఎస్ ఓపెన్లో స్విస్ వీరుల జోరు

Published Tue, Sep 8 2015 3:46 PM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

యూఎస్ ఓపెన్లో స్విస్ వీరుల జోరు

యూఎస్ ఓపెన్లో స్విస్ వీరుల జోరు

న్యూయార్క్ :  యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో స్విట్జర్లాండ్ ఆటగాళ్లు రోజర్ ఫెదరర్, వావ్రింకా ముందంజ వేశారు. ప్రిక్వార్టర్ మ్యాచ్లలో ప్రత్యర్ధులను చిత్తుచేసి క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. ఆరో టైటిల్ పై కన్నేసిన రెండో సీడ్ ఫెదరర్ 7-6, 7-6, 7-5 స్కోరు తేడాతో యూఎస్ ప్లేయర్, 13 వ సీడ్ జాన్ ఇస్నర్పై విజయం సాధించాడు.  రోజర్ ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకూ ఒక్క సెట్ కూడా ప్రత్యర్ధికి కోల్పోకపోవడం గమనార్హం.

స్విట్జర్లాండ్ మరో ఆటగాడు, ఐదో సీడ్ వావ్రింకా కూడా యూఎస్ ఓపెన్ లో జోరు కొనసాగిస్తున్నాడు. ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో 6-4, 1-6, 6-3, 6-4 తేడాతో అమెరికాకు చెందిన డొనాల్డ్ యంగ్ను మట్టికరిపించాడు. కానీ టోర్నీలో తొలిసారిగా ఓ సెట్ను ప్రత్యర్ధికి కోల్పోయాడు. అయితేనేం, తొమ్మిది గ్రాండ్ స్లామ్లలో వరుసగా ఎనిమిదో సారి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. ఈ ఏడాది జొకోవిచ్ను మట్టికరిపించి ఫ్రెంచ్ ఓపెన్ కైవసం చేసుకుని జోరుమీదున్న ఈ స్విస్ వీరుడు ఇదే దూకుడు కొనసాగిస్తే మరోసారి సంచలనం సృష్టించే అవకాశం ఉందని టెన్నిస్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement