ముంబై: మేఘాలయా క్రికెటర్ అభయ్ నేగి ముస్తాక్ అలీ టోర్నీలో రికార్డు బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. ఆదివారం మిజోరంతో జరిగిన మ్యాచ్‌లో అభయ్ 14 బంతుల్లోనే అర్ధశతకం బాది ఈ దేశవాళీ టోర్నీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఈ క్రమంలోనే రాబిన్ ఊతప్ప పేరిటనున్న ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును నేగి అధిగమించాడు.
ఈ మ్యాచ్‌లో అభయ్ ( 50 నాటౌట్; 15 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు)కు తోడు రవితేజ (53 నాటౌట్) అదరగొట్టడంతో మేఘాలయ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 207 పరుగుల భారీస్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మిజోరం 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి ఓటమి పాలైంది. మిజోరం ఆటగాడు తరువార్ కోహ్లి(90; 59 బంతుల్లో(90; 59 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. కాగా, ఆ తర్వాత కేబీ పవన్(72 నాటౌట్; 46 బంతుల్లో 6 పోర్లు, 3 సిక్సర్లు) చెలరేగినా జట్టును గెలిపించలేకపోయాడు.( ఇక్కడ చదవండి: నిషేధం తర్వాత పృథ్వీ షా మెరుపులు)
Comments
Please login to add a commentAdd a comment