ఫస్ట్ బ్యాటింగ్‌తో భారీ స్కోర్లను సెట్ చేయడమే కాదు, ప్రత్యర్థి నెలకొల్పిన 350 పైగా టార్గెట్ను ఇండియా ఛేదించింది.
సిడ్నీ : ఫస్ట్ బ్యాటింగ్‌తో భారీ స్కోర్లను సెట్ చేయడమే కాదు, ప్రత్యర్థి నెలకొల్పిన 350 పైగా టార్గెట్ను ఇండియా ఛేదించింది. గతంలో రెండు సార్లు సక్సెస్‌ఫుల్‌గా 350కి పైగా ఉన్న భారీస్కోర్లను టీమిండియా ఛేజ్ చేసింది. 2013 అక్టోబర్‌లో జైపూర్‌లో ఆసీస్ 360 పరుగుల టార్గెట్‌ను ఇండియా ఛేజ్ చేసింది. కేవలం ఒక్క వికెట్ నష్టపోయి 362 పరుగులు చేసి భారత్ సత్తాచాటింది. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరు సెంచరీలతో కదం తొక్కడంతో సునాయాసంగా భారత్ గెలిచింది. అదే సిరీస్‌లో నాగపూర్‌లో ఇండియా 4 వికెట్లు కోల్పోయి 351పరుగుల టార్గెట్ ఛేజ్ చేసింది.
350 అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అవలీలగా సాధించిన టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. రెండో విజయాన్ని ఈ మ్యాచ్‌లో ధావన్, కోహ్లి ఇద్దరు సెంచరీలు కొట్టారు. ఈ రెండు కూడా ఆసీస్‌పై సాధించిన విజయాలే కావడం గమనార్హం. ఇదిలా ఉండగా బ్యాటింగ్‌కు అనుకూలించే సిడ్నీ పిచ్ మీద సైతం ఇండియా బ్యాట్స్‌మెన్ తమ తడాఖా చూపించే అవకాశం ఉంది. కాగా, గత 10మ్యాచ్ల్లో సిడ్నీలో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్ గెలవడం భారత్ కు కలిసొచ్చే అంశంగానే చెప్పవచ్చు. ఓవరాల్గా 300 అంతకంటే ఎక్కువ పరుగులను టీమిండియా 10కంటే ఎక్కువ సార్లు ఛేజ్ చేయడం మన బ్యాటింగ్ బలాన్ని రుజువుచేస్తోంది.