వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తృటిలో హాఫ్ సెంచరీని కోల్పోయాడు.
సిడ్నీ:వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తృటిలో హాఫ్ సెంచరీని కోల్పోయాడు. 41 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 45 పరుగులు చేసిన ధావన్.. హజిల్ వుడ్ కు దొరికాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ(24)పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. 13 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టంతో 76 పరుగులు చేసింది. అంతకుముందు ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 328 పరుగులు చేసింది.