టీమిండియా టార్గెట్ 176
గాలె: మొదటి టెస్టులో టీమిండియాకు శ్రీలంక 176 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక 367 పరుగులకు ఆలౌటైంది. 5/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక 362 పరుగులు జోడించి మిగతా వికెట్లు నష్టపోయింది.
వికెట్ కీపర్ దినేశ్ చండీమల్ ఒంటరి పోరాటంతో జట్టును ఆదుకున్నాడు. అజేయ సెంచరీతో వీరోచితంగా పోరాడి జట్టును ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించాడు. 169 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సర్లతో 162 పరుగులు చేశాడు. టెస్టుల్లో అతడికిదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ముబారక్ 49, సంగక్కర 40, మాథ్యాస్ 39, తిమిమన్నె 44 పరుగులు చేసి అవుటయ్యారు.
భారత బౌలర్లలో అశ్విన్ 4, అమిత్ మిశ్రా 3 వికెట్లు పడగొట్టారు. హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మ, ఆరోన్ తలో వికెట్ తీశారు. రెండు ఇన్నింగ్స్ లో కలిపి అశ్విన్ 10 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 183, భారత్ 375 పరుగులు చేశాయి.