
సచిన్ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం
హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి స్పైస్ జెట్ విమానం ముంబైకి వెళ్లాల్సివుంది.
హైదరాబాద్ వచ్చిన సచిన్ ఈ విమానంలో ముంబైకి వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చాడు. అయితే సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని ఆపివేశారు. దీంతో సచిన్ సహా ప్రయాణికులు శంషాబాద్ విమానాశ్రయంలో వేచిఉన్నారు.