తెలంగాణ అథ్లెట్స్‌కు ఏడు స్వర్ణాలు
సాక్షి, త్రివేండ్రం: సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 31 పతకాలు లభించాయి. ఇందులో 7 స్వర్ణాలు, 7 రజతాలు, 17 కాంస్యాలు ఉన్నాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీలు మంగళవారం ముగిశాయి. ఈ ఈవెంట్‌లో ఓవరాల్‌గా కేరళ 61 స్వర్ణాలు సహా 135 పతకాలు గెలుచుకొని అగ్రస్థానంలో నిలిచింది.
తెలంగాణ తరఫున స్వర్ణ పతక విజేతల వివరాలు: బాలికల అండర్–16 (100 మీ.పరుగు): జె. దీప్తి (12.47 సెకన్లు); బాలికల అండర్–16 (200 మీ.): జె. దీప్తి (25.64 సెకన్లు); బాలుర అండర్–16 (800 మీటర్ల పరుగు): నిఖిల్‌కుమార్ (2 నిమిషాల 0.95 సెకన్లు); బాలుర అండర్–16 (షాట్‌పుట్): సత్యవాన్ (18.53 మీటర్లు); యూత్ బాలుర అండర్–18 (3 వేల మీటర్ల పరుగు): అవదేశ్‌కుమార్ (8 నిమిషాల 54.60 సెకన్లు); యూత్ బాలికల అండర్–18 (800 మీటర్ల పరుగు): పి. కావ్య (2 నిమిషాల 19.39 సెకన్లు); బాలుర అండర్–14 (100 మీ. పరుగు): వి. పృథ్వీరాజ్ (11.86 సెకన్లు).